ఫొని కంటే తిత్లీ చేసిన న‌ష్ట‌మే ఎక్కువ‌ని మ‌రిచిపోయారా?

వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మ‌రోసారి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌ల ఊక‌దంపు చేశారు! ఈసారి కూడా తాజాగా వ‌చ్చిన ఫొని తుఫాను నేప‌థ్యంలోనే టీడీపీ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేశారు. తుఫాను వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా న‌ష్టాల పేరుతో భారీ ఎత్తున దొంగ బిల్లు‌లు పెట్ట‌డం చంద్ర‌బాబు నాయుడుకి అల‌వాట‌న్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మ‌ర్లు పెద్ద సంఖ్య‌లో పోయాయంటూ గ‌తంలో ట్రాన్స్ కోకి దొంగ బిల్లులు పెట్టి సొమ్ము చేసుకున్నార‌న్నారు. గ‌తంలో కూడా ఒడిశాకి వేల సంఖ్య‌లో స్తంభాలు పంపించిన‌ట్టు త‌ప్పుడు లెక్క‌లు చూపించి, టీడీపీ నేత‌ల‌కు దోచిపెట్టార‌ని ఆరోపించారు. స‌రే… గ‌తంలో ఎప్పుడో అలా దోచుకుంటే అప్పుడే ఎందుకు విజ‌య‌సాయి నిల‌దియ్య‌లేక‌పోయారు..? అప్పుడే ఎందుకు సాక్ష్యాధారాలు బ‌య‌ట‌పెట్ట‌లేక‌పోయారు..? క‌నీసం ఇప్పుడైనా ట్రాన్స్ కోకి సంబంధించిన దొంగ బిల్లుల్లో ఒక‌టైనా చూపించ‌రా..?
అధికారంలో లేక‌పోయినా స‌రే, ఒడిశాకి సాయంగా రూ. 15 కోట్లు ఎలా ఇస్తారంటూ చంద్ర‌బాబు నాయుడుని విజ‌య‌సాయి ప్ర‌శ్నించారు. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా అధికారులు స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటే, కోడ‌లిని వేధించే అత్త‌గారి మాదిరిగీ సీఎం వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ విమ‌ర్శ‌ చేశారు. గ‌తంలో తిత్లీ తుఫాను వ‌ల్ల రూ. మూడు వేల కోట్ల‌కుపైగా న‌ష్టం వాటిల్లింద‌ని కేంద్రానికి చంద్ర‌బాబు నివేదిక పంపార‌న్నారు. కానీ, దానికంటే భ‌యంక‌ర‌మైన‌ ఫొని తుఫాను వ‌ల్ల రూ. 100 కోట్ల‌కు మించి కూడా న‌ష్టం జ‌ర‌గ‌లేద‌నీ, అంటే… గ‌తంలో చంద్ర‌బాబు వేసిన లెక్క‌ల్లో మాయావిన్యాసాలు ఉన్న‌ట్టే అని విజ‌య‌సాయి ట్వీటారు.
ఫొని తుఫాను తిత్లీ కన్నా భ‌యంక‌ర‌మైం‌దే. దాని తీవ్ర‌త ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీద ఎక్కువ‌గా ప‌డ‌లేదు. ఒడిశాపై ప‌డింది. కానీ, తిత్లీ అలా కాదు. భారీ ఎత్తున ఏపీ మీద ప్ర‌భావం చూపింది. ఉత్త‌రాంధ్ర‌లోని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల‌పాటు కుంభ‌వృష్టి వాన‌ కురిసింది. తిత్లీ తీవ్ర‌త క‌నీసం ఐదు రోజుల‌పాటు వ‌ద‌ల్లేదు. దాంతో పెద్ద ఎత్తున న‌ష్టం జ‌రిగింది. ఇదంతా విజ‌య‌సాయిరెడ్డికి గుర్తుండ‌క‌పోవ‌చ్చు! తిత్లీ వ‌ల్ల జ‌రిగిన న‌ష్టం వేరు, ఫొని వ‌ల్ల జ‌రిగిన న‌ష్టం వేరు. తిత్లీ కంటే ఫొని భ‌యంక‌ర‌మైన తుఫాను అయినంత మాత్రాన‌… అదే స్థాయి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని లెక్క‌లేయడాన్ని ఏమ‌నుకోవాలి? ఇంకోటి, తిత్లీ స‌మ‌యంలోనే… న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల కోసం విరాళాలు ఇమ్మంటూ ముఖ్య‌మంత్రి సాయం కోరితే, ఇవ్వొద్దూ అవి టీడీపీ నేత‌లు జేబుల్లోకి వెళ్లిపోతాయంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు వైకాపా నేత‌లు! అంటే, ఏ స‌మ‌యంలోనైనా రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తార‌ని వైకాపా నేతలు ఎప్ప‌టిక‌ప్పుడు నిరూపించుకుంటూనే ఉంటారు. ఆ పరంప‌ర‌ను ఈయ‌న కొన‌సాగిస్తూ ఉన్నారు!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న సోము వీర్రాజు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన సోము వీర్రాజు మొదటగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సాధారణంగా ఆయన...మొదట పవన్ కల్యాణ్‌ని కలుస్తారని భావించారు. అయితే.. పవన్ కల్యాణ్‌తో భేటీ కంటే...

అమరావతి నిధుల లెక్కలన్నీ అడిగిన హైకోర్టు..!

అమరావతిలో గత ప్రభుత్వం పెట్టిన రూ. వేల కోట్ల ప్రజాధనం వృధా పోతుందన్న పిటిషన్‌పై హైకోర్టు విచారమలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతిలో రూ. 52 వేల కోట్ల రూపాయల...

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

HOT NEWS

[X] Close
[X] Close