సుఖాలు మాకు – కష్టాలు వాళ్లవి అనే పాలసీని జగన్ రెడ్జి ఇప్పటికీ తన ప్లాన్ లో అమలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ తరపున ఇప్పుడు కూడా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న వారంతా ఒకే సామాజికవర్గానికి వారు. వారిని మళ్లీ మళ్లీ బలి చేయడానికి జగన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన ప్లాన్ అర్థం అయినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
జగన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం మీదకు ఉసిగొల్పుతున్న నేతల్లో ఉన్నది పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు వంటి వారు. ఇతర నేతలు ఎవరూ కనిపించరు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు అంతా సైలెంటుగా గా ఉండి.. ప్రభుత్వం వైపు నుంచి ఇబ్బందులు రాకుండా.. తమ వ్యాపారాలు తాము చేసుకుంటూ హాయిగా ఉన్నారు. కానీ ఒక వర్గానికి చెందిన వారిని మాత్రం మళ్లీ బూతు డోసులు పెంచుకుంటూ పోవాలని వైసీపీ వైపు నుంచి ఒత్తిడి వస్తోంది.
పేర్ని నాని బియ్యం కేసులో తన భార్యను కాపాడుకోవడానికి చాలా కాలం అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు బయటకు వచ్చి ఆయన మళ్లీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. బూతుల తీవ్రత పెంచుతున్నారు. అలాంటి నోటి దురుసుతోనే ఆయన పూర్తిగా నష్టపోయారు. రోజూ ప్రెస్మీట్లు పెట్టాలని.. ప్రభుత్వంపై స్పందించాలని ఓ వర్గం నేతలనే ఒత్తిడి చేస్తున్నారు. ఇతర నేతలు ఎవరికీ చెప్పడం లేదు. ఎందుకు ఇలా ఓ వర్గం నేతల్నే బలి చేసే ప్రయత్నం చేస్తున్నారో వైసీపీలో ఉన్న వారికి అర్థం కావడంలేదు.
జగన్ రెడ్డి కుల రాజకీయం కోసం సొంత పార్టీ వాళ్లను బలి చేయడానికి ఎప్పుడూ వెనుకాడరు. తన స్వార్థం కోసం తనతో పని చేసేవారిని బలి చేసి.. తాను వారిని నిచ్చెలాగా వాడుకుని ఎదగాలని అనుకుంటారు. ఇప్పుడు వైసీపీలో ఆ వర్గం నేతల్ని వాడుకుంటున్నారు.