అమ్మాయి వలచిందని ఆశపడ్డాడు.. మంత్రి పదవి కోల్పోయాడు..!

కర్ణాటక భారతీయ జనతా పార్టీకి .. బ్లూఫిల్మ్స్‌కు ఏదో తెలియని లింక్ ఉన్నట్లుగా ఉంది. ఆపార్టీకి చెందిన నేతలు వరుసగా ఆశ్లీల దృశ్యాల కేసుల్లో ఇరుక్కుంటూ వస్తున్నారు. ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నా అదే పరిస్థితి. గతంలో అసెంబ్లీలలోనే ఫోన్లలో పోర్న్ చూస్తూ దొరికిపోయిన ఘనత బీజేపీ ప్రజాప్రతినిధులకు ఉంది. తాజాగా ఓ మంత్రి నేరుగా ఓ యువతిని ఉద్యోగం పేరుతో ఆశపెట్టి శారీరకంగా లొంగ దీసుకున్న వ్యవహారంపై వీడియోలు బయటకు వచ్చాయి. ఆ మంత్రి పేరు రమేష్ జార్కిహోళి. వీడియోలు సంచలనం సృష్టించడంతో ఆయనతో బీజేపీ హైకమాండ్ మంత్రి పదవికి రాజీనామా చేయించింది. యడ్యూరప్ప కూడా ఆమోదించి.. గవర్నర్‌కు పంపారు. రమేష్ జార్కిహోళి ..కర్ణాకలో బీజేపీ సర్కార్ ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు.

అంతకు ముందు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. తన వర్గానికి చెందిన వారిని బీజేపీలో చేర్పించి.. రాజీనామాలు చేశారు. ఎన్నికల్లో గెలిచారు. ముందస్తు ఒప్పందం ప్రకారం మంత్రి పదవులు పొందారు. అయితే క్షణిక సుఖాల కోసం ఆయన దారి తప్పారు. తన వద్దకు వచ్చిన మహిళను లోబర్చుకున్నారు. ఆ యువతి కూడా.. ప్లాన్డ్ గా మొత్తం వ్యవహారాలన్నీ రికార్డు చేసింది. వీడియో కాల్స్ ను కూడా రికార్డు చేసింది. సెక్స్ టేపుల్ని కూడా రికార్డు చేసింది. వాటిని మొత్తం ఓ సామాజిక కార్యకర్తకు ఇవ్వడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం మీడియాకు విడుదల చేశారు.

దాంతో రమేష్ జార్కిహోళి పరువు పోయింది. బీజేపీ తలదించుకుంది. ఆయనతో రాజీనామా చేయించింది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రిపై ఆమె హనీ ట్రాప్‌కు పాల్పడ్డారని రమేష్ అనుచరులు అంటున్నారు. హనీ ట్రాప్ అయినా.. మరొకటి అయినా… ఇప్పుడు ఇరుక్కుంది మాత్రం మంత్రే. అధికారంలో ఉండగా ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగితే.. ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close