ఇంత‌కంటే డిజాస్ట‌ర్ ఉంటుందా?

అక్కినేని కుటుంబం నుంచి వ‌చ్చిన మ‌రో క‌థానాయ‌కుడు సుమంత్‌. గోదావ‌రి, స‌త్యం లాంటి సినిమాల‌తో.. ఓ ముద్ర వేశాడు. అయితే ఓ హిట్టు కోసం గ‌త కొన్నేళ్లుగా విశ్వ ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. జోన‌ర్లు మార్చినా, గెట‌ప్పులు మార్చినా.. ఫ‌లితం ఉండ‌డం లేదు. తాజాగా క‌ప‌ట‌ధారి అనే సినిమా విడుద‌లైంది. క‌న్న‌డ‌లో విడుద‌లైన క‌లువ‌ధారి అనే చిత్రానికి రీమేక్ ఇది. ఆల్రెడీ ఓ చోట బాగా ఆడిన సినిమా కాబ‌ట్టి.. మినిమం గ్యారెంటీ ఉంటుంద‌నుకున్నారంతా. పైగా ఈమ‌ధ్య క్రైమ్ డ్రామా క‌థ‌ల‌కు మంచి డిమాండ్ ఉంది. దాంతో…. ఎన్నో కొన్ని వ‌సూళ్లు వ‌స్తాయ‌నుకున్నారు. కానీ తొలి షోకే.. ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. దాంతో పాటు ఓపెనింగ్స్ ఏమాత్రం లేవు. ఈ సినిమాని స‌గ‌టు ప్రేక్ష‌కుడు ప‌ట్టించుకున్న దాఖ‌లా క‌నిపించ‌లేదు. సినిమా వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి వెళ్లిపోయింది. మొత్తంగా ఈసినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌లిపి 35 ల‌క్ష‌ల షేర్ వ‌చ్చింద‌ట‌. క‌నీసం 2 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టి తీసిన సినిమా ఇది. అందులో 20 శాతం కూడా వెన‌క్కి రాక‌పోవ‌డం నిర్మాత‌ల్ని నిరాశ‌లో ప‌డేసింది. థియేట‌రిక‌ల్ రిలీజ్ కి ముందు `క‌ప‌ట‌ధారి`కి ఓటీటీ ఆఫ‌ర్లు బాగానే వ‌చ్చాయి. ఓటీటీకి ఇచ్చేసినా – ఇంత‌కంటి మంచి మొత్త‌మే ల‌భించేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close