టాలీవుడ్‌ను చుట్టుముట్టబోతున్న కర్ణాటక డ్రగ్స్ కేసు..!?

కర్ణాటక పోలీసులు తెలుగు సినీ నటుడు తనీష్‌కు.. నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హాజరు కాకపోతే.. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి అరెస్ట్ చేసి పట్టుకెళ్లే అవకాశం ఉంది. ఒక్క తనీష్‌కు్ మాత్రమే కాదు.. మరో నలుగురు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ డ్రగ్స్ కేసు… ఇక్కడిది కాదు. కర్ణాటకది. కర్ణాటకలో బయటపడిన డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతూండగా.. లింకులు.. టాలీవుడ్‌కు దారితీశాయి. ఈ క్రమంలో తనీష్ పేరు బయటకు రావడంతో ముందుగా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరు డ్రగ్స్ కేసులో…  హీరోయిన్లు సంజన , రాగణిలను అరెస్ట్ చేసి చాలా కాలం జైల్లో ఉంచారు.

ఆ కేసు విచారణ తీగలాగుతూంటే.. అనేక లింకులు బయట పడుతున్నట్లుగా కనిపిస్తోంది. సినీ జగత్తులో మత్తు వ్యాపారం అంతా..  వ్యవస్థీకృతంగా ఉంటుందని… సినీ పరిశ్రమలు వేరైనా.. ఈ డ్రగ్స్ బిజినెస్ మాత్రం…  ఒకే రీతిన ఉంటుందని.. ఒకరికి ఒకరికి లింకులు ఉంటాయన్న ప్రచారం ఉంది. అది ఇప్పుడు.. కర్ణాటక పోలీసులు వెలికి తీసే అవకాశం కనిపిస్తోంది. గతంలో హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్‌లోనూ తనీష్ పేరు ప్రచారం జరిగింది. ఆయనకూ నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. ఇప్పుడు కర్ణాటక పోలీసుల రాడార్‌లోకి కూడా తనీష్ వెళ్లాడు. తనీష్‌ను విచారించిన తర్వాత మరికొంత మంది టాలీవుడ్ ప్రముఖులకు… కర్ణాటక పోలీసులు నోటీసులుజారీ చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొత్తానికి హైదరాబాద్ పోలీసులు.. డ్రగ్స్ కేసు విషయంలో అంతని.. ఇంతని హడావుడి చేసి.. చివరికి కేసును పక్కన పడేశారు. ఇక్కడ పోలీసులకు పొలిటికల్  ఒత్తిడి ఎదుర్కొనిఉంటారు. కానీ కర్ణాటక పోలీసులకు అలాంటి ఒత్తిళ్లేమీ ఉండవు. ఉంటే గింటే.. కర్ణాటక స్టార్ల జోలికి వెళ్లకుండా చూస్తారేమో.. కానీ ఆధారాలుంటే.. టాలీవుడ్ స్టార్ల సంగతి చూడకుండా ఉండరని అంటున్నారు. మొత్తానికి డ్రగ్స్ కేసు.. కర్ణాటక వైపు నుంచి టాలీవుడ్‌ను చుట్టు ముట్టే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close