రాజీవ్ ఖేల్ రత్నపై కర్ణాటక హైకోర్టు స్టే

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకి ప్రతిష్టాత్మకమయిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన ఒక పిటిషన్ పై కర్నాటక హైకోర్టు స్పందిస్తూ దానిపై స్టే విధించింది. కర్నాటకకు చెందిన పారా ఒలింపిక్ అధ్లేట్ హెచ్. యన్. గిరీశ కోర్టులో ఈ పిటిషను వేశారు. తను 2012 ఒలింపిక్ పోటీలలో హైజంప్ ఈవెంట్ లో వెండి పతకం సాధించినందుకు భారత ప్రభుత్వం 2013లో తనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించిందని, కానీ 2011-2014వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేని సానియా మీర్జాకు క్రీడల్లో అత్యున్నత పురస్కారం ఏవిధంగా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ అవార్డు కోసం సెలక్షన్ ప్యానల్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం చూసుకొంటే సానియా మీర్జా కంటే తనకు 90 పాయింట్లు ఎక్కువగా కలిగి ఉన్నప్పుడు, తనను కాదని ఆమెకు ఈ అత్యున్నత అవార్డు ఏ ప్రాతిపదికన ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆయన వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు సానియా మీర్జాకు రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును ఇవ్వరాదని కేంద్రప్రభుత్వాని ఆదేశిస్తూ ఈకేసులో కౌంటర్ వేయమని కోరింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చిన రేవంత్ రెడ్డి !

జర్నలిస్టులు సుదీర్ఘంగా చేస్తున్న పోరాటం ఫలించింది . జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కింద గతంలో కేటాయించిన భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాండోవర్ చేశారు. ఈ భూమికి ఒక్కో జర్నలిస్టు...

కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం!

ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా వరుసగా కొరడా ఝులిపిస్తోంది. ఓ వైపు హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా..మరోవైపు ఉన్నపళంగా భవనాలను కూల్చివేస్తుండటంపై తీవ్ర విమర్శలు...

జయభేరీది కార్ సర్వీసింగ్ సెంటర్ !

జయభేరీ మూడున్నర దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది కానీ ఇప్పటి వరకూ ఆ సంస్థపై చిన్న ఆరోపణ రాలేదు. క్లీన్ ఇమేజ్ తో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అయితే...

దివ్వెలకు ఇల్లు రాసిచ్చేసిన దువ్వాడ !

దివ్వెల మాధురీ పది రోజులు సైలెంట్ గా ఉంటానంటే.. అందరూ ఏంటో అనుకున్నారు. ఈ పది రోజుల్లో ఆమె సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసుకుంది. టెక్కలిలో ఉన్న దువ్వాడ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close