కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఓటర్ల జాబితా సవరణ జరిగింది. అప్పుడు మనం పట్టించుకోకుడా ఇప్పుడు ఈసీ తప్పు చేసిందని రెచ్చిపోవడం కరెక్ట్ కాదని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రాజన్న నిర్మోహమాటంగా రాహుల్ గాంధీ పోరాటంపై విరుచుకుపడ్డారు. అసలు రాహుల్ గాంధీ పోరాటం.. ఎందుకు చేస్తున్నారో క్లారిటీ లేకపోయినా.. ఇలా ఉన్న మాటల్ని నేరుగా బయటపెడితే ఊరుకుంటారా?. రాజన్నను పదవి నుంచి తప్పించాలని వెంటనే ఆదేశించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజన్న దగ్గర రాజీనామా లేఖ తీసుకున్నారు.
రాజన్న సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. ఆయనతో రాజీనామా చేయించాల్సి వచ్చింది. కనీసం కవర్ చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. అదే ఓ ముఖ్యమంత్రిపై ఆయన అలా మాట్లాడి ఉంటే లైట్ తీసుకునేవారు. తెలంగాణలో సీఎంపై రాజగోపాల్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నా పట్టించుకోలేదు. కానీ రాహుల్ చేస్తున్న పోరాటం తప్పని చెప్పినందుకు గంటల్లోనే మంత్రికి ఊస్టింగ్ ఇప్పించారు.
రాహుల్ గాంధీ కర్ణాటకలోని మహదేవ్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్ల జరిగిందని ఆరోపించి ధర్నా కూడా చేశారు. కానీ ఆయన ఏం చెప్పదల్చుకున్నారో మాత్రం ప్రజలకు అర్థం కావడం లేదు. దొంగ ఓట్లు వేశారా.. ఓట్ల జాబితాలో లోపాలున్నాయా.. లేకపోతే ఈవీఎంల వల్ల ఫలితాలు తేడాలొస్తున్నాయా అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. అర్థం కాని వాళ్లు అర్థమైనట్లుగా ఉండాలన్నది కాంగ్రెస్ రూల్. దాన్ని పాటించకపోతే రాజన్నలాగా పదవులు పోగొట్టుకోవాల్సి ఉంటుంది.