పూర్వీకులు సంపాదించి పెట్టిన ఆస్తిని నాశనం చేసుకుంటూ.. ఎవరైనా ప్రశ్నిస్తే మీకు లేదు.. మాకు ఉంది అందుకే మీకు కడుపు మంట అనే వారిని ఎవరేం చేయగలరు?. ఇప్పుడు కర్ణాటక పరిస్థితి అంతే ఉంది. గతంలో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసి పోయారు పాలకులు. ఓ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రస్తుత పాలకులు. కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. వారి చేతకాని తనాన్ని తమకు అడ్వాంటేజ్ గా మార్చుకునేందుకు ఇతర రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయా రాష్ట్రాలను విమర్శించి.. తృప్తి పడుతున్నారు కానీ తమ తప్పులేమిటో తెలుసుకోవడం లేదు.
మొన్న డీకే.. నిన్న ఖర్గే
బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అ ట్రాఫిక్‌లో మళ్లీ రోడ్లపై గుంతలు. ఆ విషయాన్ని ప్రశ్నించి ఒళ్లు హూనం అయిపోతోందని.. తమ ఆఫీసును మార్చుకోవాలనుకుంటున్నానని ఓ స్టార్టప్ సీఈవో పోస్టు పెడితే.. బ్లాక్ మెయిలింగ్ కు లొంగేది లేదని.. ఎక్కడికి కావాలంటే అక్కడికి పోవచ్చని డిప్యూటీ సీఎం శివకుమార్ తేల్చేశారు. ఆ మాట విని పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యపోయారు.సమస్యను పరిష్కరిస్తారని అనుకున్నారు కానీ పోతే పొండి అంటారనుకోలేదు. ఇప్పుడు మల్లిఖార్జున్ ఖర్గే .. కుమారుడు కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే కూడా అలాగే మాట్లాడుతున్నారు.
లోకేష్ ఆహ్వానాలు – కించ పరిచేలా మంత్రుల వ్యాఖ్యలు
ఐటీ పరిశ్రమల్ని అనంతపురంకు ఆహ్వానిస్తున్నారని లోకేష్‌పై ప్రియాంక్ ఖర్గే ఫైరయ్యారు. ఏపీపై అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. తాము సుసంపన్నులమని.. తమ ఓవర్ ఫ్లోస్‌ను తీసుకోవడానికి చకోరపక్షిగా ఎదురు చూస్తున్నారని వాగేశారు. ఆయన అహంకారం చూసి.. వీళ్లకు అధికారం నెత్తికెక్కిందని కన్నడిగులు కూడా అనుకోవాల్సిన పరిస్థితి. ఏపీలో పెట్టుబడులకు కంపెనీల యజమానులను లోకేష్ ఆహ్వానిస్తే.. వారు దగ్గర నుంచి పోవాలనుకుంటే..ఆ సమస్యలేమిటో గుర్తించి పరిష్కరించాలి కానీ.. ఇలా పొరుగు రాష్ట్రాలను కించ పరిస్తే ఏమి వస్తుంది.
చిన్న అవకాశం కూడా వదలని లోకేష్
పారిశ్రామిక వేత్తలు, స్టార్టర్ యజమానులు పెట్టుబడుల విషయంలో ఏ చిన్న అవకాశం ఉన్నా నారా లోకేష్ వదిలి పెట్టడం లేదు. సోషల్ మీడియాలోనూ ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆహ్వానిస్తున్నారు. తమ వద్ద మంచి ఎకో సిస్టమ్ ఉందని పిలుస్తున్నారు. బెంగళూరుకు సమీపంలో అనంతపురం ఉంది. అక్కడ కియా ఉంది. కియా ఉద్యోగులు.. ఇతరులు చాలా మంది బెంగళూరు నుంచి రెగ్యులర్ గా వస్తూంటారు. కియా వల్ల కర్ణాటక లాభపడుతున్నట్లే కదా. కానీ లోకేష్ ఎప్పుడూ అలాంటి ఆలోచనకు రానివ్వరు. కానీ కర్ణాటక మంత్రులు అదే ఆలోచన చేస్తూంటారు. విమర్శలు చేస్తూంటారు. ఇది అహంకారమే.