కార్తికేయ 3… కండీష‌న్ల్స్ అప్లై!

తెలుగులో సీక్వెల్స్ హిట్ట‌యిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. బాహుబ‌లి 1, 2 వ‌చ్చాయి కానీ అవి సీక్వెల్స్ కావు. కేవ‌లం కొన‌సాగింపు మాత్ర‌మే. కేజీఎఫ్ కూడా అంతే. శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ హిట్ట‌యితే, శంక‌ర్ దాదా జిందాబాద్ ఫ్లాప్ అయ్యింది. అయినా అప్పుడ‌ప్పుడూ సీక్వెల్ ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ద‌ర్శ‌కులు. ఇప్పుడు కార్తికేయ – 2 వ‌స్తోంది. నిఖిల్ – చందూ మొండేటి కాంబోలో వ‌చ్చిన కార్తికేయ మంచి విజ‌యాన్ని అందుకొంది. ఆ ఉత్సాహంతోనే పార్ట్ 2 తీశారు.పార్ట్ 1 క‌థ‌కూ, పార్ట్ 2 క‌థ‌కూ సంబంధం ఉండ‌దు. కేవ‌లం పాత్ర‌లు కొన‌సాగుతాయి. శ‌నివారం ఈ సినిమా విడుద‌ల అవుతోంది.

అన్నీ కుదిరితే.. పార్ట్ 3 కూడా తీస్తాన‌ని చందూ మొండేటి చెబుతున్నాడు. కార్తికేయ అనే పాత్ర‌ని ఎన్నిసినిమాలైనా చేయొచ్చ‌ని, ప్రేక్ష‌కులు ఆద‌రించేంత వ‌ర‌కూ.. ఈ ప‌రంప‌ర కొన‌సాగుతుంద‌ని చందూ చెప్పాడు. అంటే కార్తికేయ 2 హిట్ట‌యితే, పార్ట్ 3కి మార్గం సుగ‌మం అయిన‌ట్టే. కార్తికేయ పై అప్పుడు ఎవ‌రికీ ఎలాంటి అంచ‌నాలూ లేవు. నిర్మాణ వ్య‌యం కూడా త‌క్కువే. కార్తికేయ 2 అలా కాదు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అనుప‌మ్ ఖేర్ లాంటి స్టార్ కాస్టింగ్ తీసుకొచ్చారు. గ్రాఫిక్స్ భారీగా ఉన్నాయి. బ‌డ్జెట్ బాగా పెరిగింది. కాబ‌ట్టి.. రిట‌ర్న్స్ ఎలా ఉంటాయో చూడాలి. పార్ట్ 3 అనుకొన్నా, ఇప్పుడే మొద‌ల‌య్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. చందూ చేతిలో మ‌రో రెండు సినిమాలున్నాయి. ఇప్ప‌టికే గీతా ఆర్ట్స్ చందూకి అడ్వాన్స్ ఇచ్చింది. ఆ త‌ర‌వాత నాగార్జున‌తో ఓ సినిమా చేస్తాడు. ఆ సినిమాకి సంబంధించిన క‌థ కూడా రెడీ అయిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ అంచనాల్ని అందుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ !

ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. ఐ ప్యాక్ కన్నా పీకే పైనే అందరికీ గురి. బెంగాల్ తర్వాత తాను...

సోషల్ మీడియాలోనూ దారి తప్పిన ఏపీ రాజకీయాలు !

తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు...

మిడిల్ డ్రాప్ … దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ లేనట్లే !

ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నతలు వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని పొగుడుతున్నారు. వెళ్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు...

ఏపీలో పోటాపోటీ పోస్టర్లు .. భారతీ పే !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గోడలకెక్కుతున్నాయి. గతంలో చంద్రబాబు వియ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అన్నారంటూ... ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన వార్తను పెద్ద పెద్ద పోస్టర్లు చేసి వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close