స‌మంత‌కు కార్తికేయ క‌ర్చీఫ్‌

ఈ ఆదివారం బిగ్ బాస్ 4 సెట్లో సంద‌డి చేసింది స‌మంత‌. మావ నాగార్జున లేని లోటుని… త‌న న‌వ్వుల‌తో, త‌న స్క్రీన్ ప్రెజెన్స్‌తో భ‌ర్తీ చేయ‌గ‌లిగింది. ఈ షోలో.. కార్తికేయ కూడా త‌న ఆట – పాట‌తో ఆక‌ట్టుకున్నాడు. అఖిల్ కూడా మెరిశాడు. వీట‌న్నింటికీ హైప‌ర్ ఆది పంచ్‌లు తోడై.. మొత్తానికి సండే ఎపిసోడ్ స్పెష‌ల్‌గా మారిపోయింది.

ఈ వారం దేవి బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. దేవిని సాగ‌నంపేట‌ప్పుడు కార్తికేయ స్టేజ్‌పైనే ఉన్నాడు. ఈ సంద‌ర్భంలో స‌మంత‌.. కార్తికేయ‌ని `దేవికి నీ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలి` అంటూ అభ్య‌ర్థించాలి. దానికి కార్తికేయ పాజిటీవ్ గా స్పందించాడు. `దేవి మ‌హేష్ సినిమాలోనే న‌టించింది క‌దా. నా సినిమాలో త‌ప్ప‌కుండా ఇస్తా` అని మాటిచ్చేశాడు. అంతేకాదు… స‌మంత‌కు క‌ర్చీఫ్ కూడా వేశాడు. `దేవిని నా సినిమాలో తీసుకోమ‌న్నారు క‌దా. నాదో రిక్వెస్ట్. మీరు నాతో పాటు న‌టిస్తారా` అంటూ స‌మంత‌కు క‌ర్చీఫ్ వేసేశాడు. దానికి స‌మంత కూడా ఓకే అనేసింది. `దేవి, నువ్వు, నేనూ క‌లిసి న‌టిద్దాం` అని మాటిచ్చింది. అయితే.. ఇలాంటి షోల‌లో మాట ఇచ్చిపుచ్చుకోవ‌డం మామాలే. ఇవ‌న్నీ ఫార్మ‌లాలిటీకి జ‌రుగుతుంటాయి. కాక‌పోతే.. చిత్ర‌సీమ‌లో ఏదైనా జ‌ర‌గొచ్చు. రేపు.. స‌మంత‌, కార్తికేయ క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తే, ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ద‌ర్శ‌కేంద్రుడితో… స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌

కె.రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయ‌న త‌న‌లోని కొత్త కోణాన్నిచూపించ‌బోతున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌లు...

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

HOT NEWS

[X] Close
[X] Close