ప‌వ‌న్ అడిగాడు.. త్రివిక్ర‌మ్ కాద‌న్నాడు

`అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్ కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ద‌స‌రా సంద‌ర్భంగా ఆదివారం వ‌చ్చేసింది. ఈ రీమేక్‌లో ప‌వ‌న్‌న‌టిస్తాడా, లేదా? అన్న స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ద‌ర్శ‌కుడిగా… సాగ‌ర్ చంద్ర పేరు ఖాయ‌మైంది. అయితే ఈ అనౌన్స్‌మెంట్ రావ‌డానికి ముందు చాలానే మంత‌నాలు జ‌రిగిన‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమా ఎలాగైనా స‌రే, త్రివిక్ర‌మ్ చేతిలో పెట్టాల‌ని ప‌వ‌న్ భావించాడ‌ట‌. `ఈ సినిమాకి మీరే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలి` అని ప‌వ‌న్ అడిగిన‌ట్టు తెలుస్తోంది. కానీ త్రివిక్ర‌మ్ మాత్రం అందుకు `నో` చెప్పాడ‌ట‌.

త్రివిక్ర‌మ్ – ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా ఈపాటికే ప‌ట్టాలెక్కాల్సింది. కానీ… అది ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ఈ గ్యాప్‌లో మ‌రో సినిమా చేయాల‌న్న‌ది త్రివిక్ర‌మ్ ప్ర‌య‌త్నం. ఎలాగూ మ‌రో సినిమా చేద్దామ‌నుకుంటున్నారు క‌దా, అది ఈ సినిమానే ఎందుకు కాకూడ‌దు.? అని `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్‌ని ఆయ‌న చేతిలో పెట్టాల‌ని ప‌వ‌న్ భావించాడు. అస‌లు ఈ సినిమాలోకి ప‌వ‌న్‌కి లాక్కొచ్చిందే త్రివిక్ర‌మ్‌. సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ ఈ సినిమా రైట్స్ తీసుకుంది. అప్ప‌టి వ‌ర‌కూ ర‌క‌ర‌కాల కాంబినేష‌న్ల‌ని ప్ర‌య‌త్నించింది గానీ, ప‌వ‌న్ తో చేద్దామ‌న్న ఆలోచ‌నే లేదు. కానీ త్రివిక్ర‌మ్ ఈ సినిమాని ప‌వ‌న్‌కి చూపించ‌డం, ప‌వ‌న్ `ఓకే` అన‌డం జ‌రిగిపోయాయి. ఈ రీమేక్ లో ప‌వ‌న్‌ని లాక్కొచ్చిన క్రెడిట్ త్రివిక్ర‌మ్ దే.

అలానే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు కూడా ఆయ‌నకే ఇవ్వాల‌ని ప‌వ‌న్ అనుకున్నాడు. కానీ త్రివిక్ర‌మ్ ఒప్పులేదు. దానికి రెండు కార‌ణాలున్నాయి. అప్ప‌టికే ఈ సినిమా స్క్రిప్టుపై సాగ‌ర్ చంద్ర చాలా వ‌ర్క్ చేశాడు. దాదాపు ప‌వ‌న్‌కి త‌గిన మార్పుల‌తో స్క్రిప్టు సిద్ధం చేశాడు. ఈ క‌థ‌ని ప‌వ‌న్‌కి వినిపించింది సాగ‌ర్‌నే. అలాంట‌ప్పుడు త‌న‌ని ప‌క్క‌న పెట్ట‌డం బాగోదు. పైగా రీమేక్ క‌థ‌ల్ని తీయ‌డం త్రివిక్ర‌మ్‌కి న‌చ్చ‌దు. ఓ ర‌చ‌యిత‌గా అది త‌న‌కు ఇబ్బంది క‌లిగించే విష‌యం. అన్నింటికంటే ముఖ్యంగా ప‌వ‌న్ కోసం త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర ఓ క‌థ రెడీగా ఉంది. ప‌వ‌న్‌తో మ‌రో సినిమా చేయాలంటే ఆ క‌థ‌నే ప‌ట్టాలెక్కిద్దామ‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు ఈ రీమేక్ చేసుకుపోతే.. ప‌వ‌న్ తో మ‌రో సారి కాంబినేష‌న్ కుద‌ర‌డానికి టైమ్ ప‌ట్టొచ్చు. అందుకే ఈసారికి.. సాగ‌ర్ చంద్ర‌కే బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ ఈ సినిమా నేను చేయ‌ను అని ఖ‌రాఖండీగా చెప్పేశాకే… రీమేక్‌కి సంబంధించిన ప్ర‌క‌ట‌న అధికారికంగా విడుద‌ల చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ రైతు టూర్..!

నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం... రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి....

చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు..!?

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనర్హతా వేటు వేస్తారా..?. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు...

కోహ్లీ… ఇదేం కెప్టెన్సీ??

ప్ర‌పంచ అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ల‌లో కోహ్లీ ఒక‌డు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలూ లేవు. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుల‌న్నీ బ‌ద్దలు కొట్ట‌గ‌ల సామ‌ర్థ్యం త‌న‌కు మాత్ర‌మే ఉంద‌న్న‌ది క్రికెట్ అభిమానుల...

రైతులకు పరిహారంపై జగన్ ఔదార్యం చూపలేకపోతున్నారా..!?

నివార్ తుపాన్ కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి భారీ నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశ పడిన వారికి నిరాశే ఎదురయింది. ఎకరానికి పంటను బట్టి పదిహేను నుంచి పాతిక వేల...

HOT NEWS

[X] Close
[X] Close