ప్రజలతో సంబంధం లేకుండా ఏపీ బీజేపీ బలపడుతుందా..?

కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి… ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏపీలో బీజేపీ బలపడుతుందని.. ఇక అధికారంలోకి రావడమే తరువాయి అన్నట్లుగా ప్రసంగించారు. అంత వరకూ బాగానే ఉంది కానీ…  అసలు ఎలా బలపుడుతుందనే సందేహం చాలా మందికి వచ్చింది. ఎందుకంటే..ఏపీ బీజేపీ నేతలు.. ఒక్కరంటే.. ఒక్కరైనా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారా.. పోరాడుతున్నారా..అని దుర్భిణి పెట్టి వెదికినా ప్రయోజనం లేకుండా పోతోంది మరి. రాజధానికి మద్దతు అంటూ.. బీజేపీ చేస్తున్న విన్యాసాలు.. ప్రజల్లో ఆ పార్టీపై మరింత వ్యతిరేకత పెంచాయి కానీ తగ్గించలేదు. కానీ అదే విధానాన్ని అనుసరిస్తోంది. తాజాగా వైసీపీ నేతలతో పోటీ పడి… అమరావతి మహిళలపై దురుసుమాటలు కూడా మాట్లాడుతున్నారు.

ఏక ప్రతిపక్షంగా కనీసం.. అధికార పార్టీపై విమర్శలు చేయాలి. అయితే.. బీజేపీ నేతలు మొహమాట పడుతున్నారు. ఏపీ సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై ప్రజల ఉపాధి దెబ్బతింటోంది.. వారిపై పన్నుల భారం పెరుగుతోంది. రోడ్లు అధ్వాన్న స్థితికి చేరాయి. కానీ రిపేర్లు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడటం లేదు. వర్షాలు.. వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. సాయం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంలోనూ విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రభుత్వంపై పోరాడటానికి అనేక ప్రజాసమస్యలు ఉన్నాయి. కానీ బీజేపీ నేతలు…  మాత్రం..  వేటినీ పట్టించుకోవడం లేదు. కానీ తాము బలపడిపోతున్నామని.. అధికారంలోకి వచ్చేస్తామని ఆశ పడుతున్నారు.

బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన సైలెంటయిపోయింది. ఆ పార్టీని నియంత్రిస్తూ.. వైసీపీకి మరింత మేలు చేస్తున్నారు కానీ.. బీజేపీ నేతలు.. సొంతంగా ఎదిగే ప్రయత్నమే చేయడం లేదు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు.. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ… ఉండేవారు. దాని వల్ల బీజేపీ ఎప్పుడూ మీడియాలో పోరాడుతున్నట్లుగా ఉండేది. కానీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చాక.. వైసీపీకి అనుబంధ సంస్థగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆశలు పెట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ సాధించాలంటే… ఎంతో కష్టపడాలి.. ఆ నైజం ఏపీ బీజేపీ నేతల్లో కనిపించడం లేదనేది.. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ రైతు టూర్..!

నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం... రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి....

చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు..!?

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనర్హతా వేటు వేస్తారా..?. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు...

కోహ్లీ… ఇదేం కెప్టెన్సీ??

ప్ర‌పంచ అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ల‌లో కోహ్లీ ఒక‌డు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలూ లేవు. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుల‌న్నీ బ‌ద్దలు కొట్ట‌గ‌ల సామ‌ర్థ్యం త‌న‌కు మాత్ర‌మే ఉంద‌న్న‌ది క్రికెట్ అభిమానుల...

రైతులకు పరిహారంపై జగన్ ఔదార్యం చూపలేకపోతున్నారా..!?

నివార్ తుపాన్ కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి భారీ నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశ పడిన వారికి నిరాశే ఎదురయింది. ఎకరానికి పంటను బట్టి పదిహేను నుంచి పాతిక వేల...

HOT NEWS

[X] Close
[X] Close