ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులందర్నీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో.. వారిలో ఒకరు అయిన కవిత సంతోషపడ్డారు. ఆమె కడిగిన ముత్యంలా బయటకు వచ్చినందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ ఎక్కువగా సంతోషపడాలి. అయితే ..ఆమె సొంత రాజకీయ బాటలో ఉండటంతో బీఆర్ఎస్ వైపు నుంచి స్పందనలేదు. కేటీఆర్ స్పందించారు కానీ.. ఆ స్పందనలో కవితను నిందించేలా పదజాలం ఉండటం వివాదాస్పదమవుతోంది. కేటీఆర్ పై విమర్శలు వస్తున్నాయి.
బీజేపీ తప్పుడు కేసులు పెట్టి రాజకీయ పార్టీలను వేధిస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ కేసుల వల్లనే ఢిల్లీలో ఆప్..తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఈ ట్వీట్ పై కవిత మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కేసు వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందని కేటీఆర్ అంటున్నారని..
ఒక్కసారి గతాన్ని రివైండ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. నేను జైలుకు వెళ్లే వరకు ఒక్కసారైనా కేటీఆర్, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారా అని ప్రశ్నించారు.
కనీసం బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా సపోర్ట్ చేయలేదన్నారు. ఇళ్లు ఇవ్వకపోవడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, దోపిడీ దారుల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు.
కేటీఆర్ సోదరికి అభినందనలు చెప్పి ఆమెకు మోరల్ సపోర్టు ఇచ్చేలా ట్వీట్ పెట్టి ఉంటే.. అభినందనలు వచ్చవి. కష్టకాలంలో ఆమెకు సపోర్టుగా ఉన్నారని అనుకునేవారు. కానీ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటపడితే.. ఆ కేసు వల్లనే తాము ఓడిపోయామని సానుభూతిపొందే ప్రయత్నం చేయడంపై కవిత నుంచే నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిణామాలు కవితకు మరింత బలాన్ని చ్చేలా ఉన్నాయి.
