వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆయన శాసనమండలి సమావేశాల్లో పాల్గొన్నారు. బయట మీడియాతో మాట్లాడారు శుక్రవారం కల్తీ నెయ్యిపై చర్చకు పట్టుబడతామన్నారు. కానీ అనూహ్యంగా శాసనమండలి ప్రారంభమయ్యే సమయానికి ఆయన రాలేదు. వైసీపీ సభ్యులే తమ రోజువారీ ఆందోళన కొనసాగించారు. అయితే మధ్యాహ్నానికి బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని హైదరాబాద్ తరలించారన్న సమాచారం బయటకు వచ్చింది.
బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించడంతో ఎందుకైనా మంచిదని హైదరాబాద్ కు తీసుకు వచ్చి సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించినట్లుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రమాదం ఏమీ లేదని అంతా బాగుందని.. అబ్జర్వేషన్లో పెట్టారని వైద్యులు చెప్పినట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. బొత్స కుమార్తె కూడా దాదాపుగా అదే చెప్పారు. అయితే అమరావతి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చి ఆస్పత్రిలో చేర్పించిన తరవాత మాత్రమే అసలు విషయం బయటకు వచ్చింది.
నేరుగా సిటీ న్యూరో ఆస్పత్రి చేర్పించడం పై కూడా రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆ ఆస్పత్రి జగన్ రెడ్డి..కోడి కత్తి ఘాటుగా ఫేక్ వైద్యం చేసిన ఆస్పత్రి. ఆ ఆస్పత్రి యజమాని ఐదేళ్ల పాటు సలహాదారు పదవిలో ప్రజాధనం జీతంగా తీసుకున్నారు. అదేమంత పెద్దగా పేరుపొందిన ఆస్పత్రి కూడా కాదు. ఏఐజీ లాంటి ఆస్పత్రులకు వైసీపీ చోటా నేతలు కూడా ప్రాధాన్యమిస్తారు. మరి బొత్స సిటీ న్యూరో ఆస్పత్రికే ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారో వైసీపీ నేతలకే తెలియాలి.


