కవిత సెల్ఫ్‌డబ్బా

హైదరాబాద్: పార్లమెంట్‌లో ఏ విషయంపైనైనా ఆచి తూచి, పూర్తిగా అధ్యయనం చేశాకే మాట్లాడతానని, తన ప్రతిభ, వాక్చాతుర్యంచూసి ప్రతిపక్షాల సభ్యులుకూడా తాను మంత్రి అవ్వాలని ఆకాంక్షిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. వారి అదృష్టం బాగుండి మంత్రి పదవివస్తే చూద్దామని అని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి తమపార్టీ అంశాలవారీగా మద్దతిస్తోందని చెప్పారు. బీజేపీకి టీఆర్ఎస్ మిత్రపక్షమూకాదు, ప్రతిపక్షమూ కాదని అన్నారు. కేంద్రం తెలంగాణకు సరిగా మద్దతివ్వటంలేదని ఆరోపించారు. ప్రతి ఎంపీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటూ కేంద్రం రూపొందించిన పథకాన్ని యూజ్‌లెస్ స్కీమ్ అని కవిత తెగనాడారు. ఎంపీ పరిధిలో సగటున 800 గ్రామాలుండగా ఒక్క గ్రామాన్నే దత్తత పేరుతో అభివృద్ధి చేయాలని చెప్పడమేందని అడిగారు. ఎంపీ మన ఊరు, మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా కవిత కరీంనగర్ జిల్లా సారంగపూర్‌లో మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి స్వగ్రామం బీర్‌పూర్‌లో పర్యటించారు. మావోయిస్టులు అడవులు వీడి బంగారు తెలంగాణకు సహకరించాలని అన్నారు. మావోయిస్టులది, టీఆర్ఎస్‌ది ఒకటే ఎజెండా అని చెప్పారు. వారి జెండా ఎరుపు అయితే, తమది గులాబీ జెండా అని పోల్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“జై అమరావతి” అంటే బీజేపీలో సస్పెన్షనే..!

అమరావతి రైతుల కోసం పోరాడతామని భారతీయ జనతా పార్టీ ఓ వైపు చెబుతోంది. ఆ రైతులకు మద్దతు చెప్పేందుకు వెళ్లిన నేతలపై మాత్రం సస్పెన్షన్ల వేటు వేస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా ఓ...

మోడీకి జగన్ అభినందనలు..!

నిజమే.. మీరు కరెక్ట్‌గానే చదివారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జగన్ అభినందనలు తెలిపారు. మోడీ ఆ అభినందులు రిసీవ్ చేసుకుని .. జగన్ అభినందించినందుకు పొంగిపోయారో లేదో తెలియదు కానీ.. మోడీని జగన్ అభినందించిన...

క్రైమ్ : ఒకరిది ఆత్మహత్య…మరొకరిది హత్య..! ఇద్దరు తండ్రుల కథ..!

వారిద్దరూ ఆడపిల్లల తల్లిదండ్రులు. కని పెంచి.. అల్లారుముద్దుగా పెంచి.. తమకు చేతనయినంతలో మంచోళ్లు అనుకునే వాళ్లకే కట్టబెట్టారు. కానీ వారు అనుకున్నంత మంచోళ్లు కాదు. ఆ విషయం తెలిసి తమ కూతుళ్లు జీవితాలు...

ఐవైఆర్ కూడా అమరావతినే ఉంచమంటున్నారు..!

వారం రోజులు ఆలస్యంగా తన పెన్షన్ వచ్చిందని... మూడు రోజులుగా ఐవైఆర్ కృష్ణారావు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఆయన రోజువారీగా... ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి జగన్‌కు సలహాలిస్తూ ట్వీట్లు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close