కల్వకుంట్ల కవిత శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు. మహిళ కన్నీరు పెడితే అందరూ కరిగిపోతారు. కవిత కూడా అదే కన్నీటిని ఆయుధంగా చేసుకున్నారు. తనకు బీఆర్ఎస్ లో .. కుటుంబంలో జరిగిన అవమానాల్ని చెప్పుకున్నారు. తెలంగాణ కోసం తాను పడిన కష్టాన్ని వివరించారు. తర్వాత బయటకు వచ్చి గన్ పార్క్ వద్ద తాను చెప్పాలనుకున్నది మరోసారి చెప్పారు. ఓ రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని శపథం చేశారు. కవిత ఇదంతా ఎందుకు చేశారంటే.. తన రాజకీయ ప్రవేశం గురించి చెప్పడానికే.
ఇప్పటి వరకూ కవిత రాజకీయాలు చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. కానీ ఇంకా కొత్త రాజకీయ పార్టీ గురించి ప్రకటన చేలేదు. ఇప్పుడు ఆమె తన రాజకీయ పార్టీ గురించి చెప్పారు. జాగృతిని రాజకీయ శక్తిగా మారుస్తానని చెప్పారు. ఇలా ప్రకటన చేయడానికి ఓ ఎఫెక్ట్ రావడానికి.. హైప్ రావడానికే కవిత కన్నీరు పెట్టుకున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే కవిత కన్నీరు అంశం వైరల్ గా మారినప్పటికీ ఆమె పార్టీ ప్రకటిస్తామని..రాజకీయాల్లోకి వస్తున్నామని చేసిన ప్రకనటకు మాత్రం పెద్దగా హైప్ రాలేదు. ఎందుకంటే కవిత రాజకీయాలు చేస్తున్నారని అందిరకీ తెలుసు. జాగృతని పార్టీగా మార్చే ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తున్నారని తెలుసు. కొత్తగా ఆమె ప్రకటన చేసినా.. అంతా పాత విషయమేగా అనుకున్నారు. అయితే మండలిలో ఆమె ప్రసంగం మాత్రం.. రాజకీయంగా ఉపయోగించుకోవడానికి బాగా పనికి వస్తుంది. ఈ విషయంలో మండలి చైర్మన్ సంపూర్ణంగా కవితకు సహకరించారు.
