కల్వకుంట్ల కవిత 2025లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సస్పెండ్ చేసి ఆమెకు షాక్ ఇచ్చినా.. ఆమె మాత్రం రివర్స్ షాకులు వరుసగా ఇస్తూనే ఉన్నారు. ఏడాది చివరి రోజు ఆమె ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ లో చాలా విషయాలు చెప్పారు. అవన్నీ బీఆర్ఎస్ నేతలకు షాకిచ్చేవే.
కేటీఆర్ రాజకీయాల గురించి ఆమె నేరుగానే విమర్శలు గుప్పించారు. తానే ఎక్కువగా పార్టీకి సేవ చేశానన్నారు. కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరాడని.. తాను మాత్రం నా సొంతంగా 2006 లో తెలంగాణ జాగృతి అనే సంస్థని ఏర్పాటు చేశానని ఇంటర్యూలో గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నానన్నారు. అధికారం చేపట్టాక పార్టీలో ఉన్న కొందరి ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. తనను కార్నర్ చేస్తున్నారన్న అనుమానం నాకు అప్పుడే కలిగిందన్నారు. కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని కవిత ప్రశ్నించారు.
మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో SIT నోటీసులు ఇచ్చింది. నా ఫోన్, నా భర్త ఫోన్, ఇంట్లో పని చేసే వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని నాకు అప్పుడు అర్థమైందని కవిత తెలిపారు. మహిళలు రాజకీయాల్లో ఉండడమే నేరమా అని కవిత ప్రశ్నించారు. మేము రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉండడం తప్పా..
దేశ చరిత్ర తిరగేసినా దేశం కోసం కొట్లాడిన మహిళలెవరికీ పెద్ద పదవులు రాలేదన్నారు. గతంలో కేసీఆర్ గారు 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే అందులో ఒక్క మహిళకు కూడా ఛాన్స్ ఇవ్వలేదని.. ఒక్క మహిళకి కూడా ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని నేను ఆరోజే కేసీఆర్ని ప్రశ్నించానన్నారు. ఎంత మంది మహిళ ఉద్యమకారిణీలు ఎంత నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్యూలో హరీష్ రావుపై కవితతీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన బీఆర్ఎస్ చంద్రబాబు అని తేల్చారు. కవిత ఇయర్ ఎండింగ్ ఇచ్చిన ఇంటర్యూ సంచలనంగా మారింది. వచ్చే ఏడాది మరింత దూకుడుగా ఆమె బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించండ ఖాయంగా కనిపిస్తోంది.
