వైసీపీలోకి కావూరి సాంబశివరావు..?

భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమయింది. ఈ మేరకు… సంప్రదింపులు పూర్తయ్యాయని.. అటు వైసీపీలోనూ.. ఇటు .. బీజేపీలోనూ… ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలనుకుంటున్న కావూరి.. దానికి బీజేపీ సరైన పార్టీ కాదని అనుకుంటున్నారు. సుదీర్ఘ కాలం కాలం కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడానికి కూడా.. కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటగా టీడీపీలో చేరాలనుకున్నారు. చేరడానికి సిద్ధమయ్యారు. కానీ… అప్పటికే ఎంపీగా… టీడీపీ తరపున మాగంటి బాబుకు టిక్కెట్ ఖారారు చేశారు. మాగంటి బాబును.. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పంపి.. కావూరికి టిక్కెట్ ఇద్దామని అనుకున్నా… కైకలూరు బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది.

దాంతో.. కావూరికి చాన్స్ దొరకలేదు. అదే సమయంలో.. బీజేపీలో చేరి.. ఏలూరు ను బీజేపీకి కేటాయించుకునేలా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. కుదరదలేదు. దాంతో బలవంతంగా బీజేపీలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ.. పెద్దగా యాక్టివ్‌గా ఎప్పుడూ లేరు. ఇటీవలి కాలంలో పోటీ కోసం.. ఆయన వైసీపీతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కావూరిని తీసుకునేందుకు.. జగన్ కూడా సంసిద్ధత తెలియచేయడంతో.. నేడో రేపో ఆయన పార్టీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.

నిజానికి కావూరి సాంబశివరావుకు… చంద్రబాబు కుటుంబంతో దగ్గరి బంధుత్వం ఉంది. బాలకృష్ణ రెండో అల్లుడు.. విశాఖ ఎంపీ సీటు కోసం.. రేసులో ఉన్న భరత్ … కావూరి కూతురు కుమారుడే. బంధుత్వాలతో అయినా టీడీపీలో టిక్కెట్ తెచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో.. ఆయన వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. వైసీపీలో ఇప్పటికే ఏలూరు లోక్ సభ టిక్కెట్ హామీతో.. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు.. కోటగిరి శ్రీధర్‌ను పార్టీలో చేర్చుకున్నారు జగన్. ఆయన కొంత కాలంగా పని చేసుకుంటున్నారు. ఇప్పుడు కావూరిని చేర్చుకుంటే… ఆయనకు హ్యాండివ్వాల్సిందే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకీ వాకిట్లో… మ‌ల్టీస్టార‌ర్ల చెట్టు!

మ‌ల్టీస్టార‌ర్ అన‌గానే.. ఇది వ‌ర‌కు హీరోలు భ‌య‌ప‌డిపోయేవారు. క‌థ కుద‌ర‌దండీ.. ఇమేజ్‌లు అడ్డొస్తాయి.. బ‌డ్జెట్లు స‌రిపోవు... - ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెప్పేవారు. క‌థ‌లు ఉన్నా, వాటిని చేయ‌డానికి హీరోలు ధైర్యం చూపించేవారు. ఈగో గోడ‌లు అడ్డొచ్చేవి. అయితే...

నాని సినిమాకి ‘బ‌డ్జెట్‌’ స‌మ‌స్య‌

నాని సినిమాల‌కున్న గొప్ప ల‌క్ష‌ణం ఏమిటంటే.. త‌న మార్కెట్ ప‌రిధిని దాటి ఎప్పుడూ ఖ‌ర్చు చేయ‌నివ్వ‌డు. అందుకు సినిమా కాస్త అటూ ఇటూ అయినా నిర్మాత టేబుల్ ప్రాఫిట్‌తో బ‌య‌ట‌ప‌డిపోతాడు. బ‌డ్జెట్ దాటుతోందంటే.....

కోర్టు ను విమర్శించిన మా వాళ్ళంతా నిరక్షరాస్యులే: వైకాపా నేత

ఇటీవలికాలంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తీసుకుంటున్న అవకతవక నిర్ణయాలను కోర్టులు తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యంలో ఏది పడితే అది చేయడానికి కుదరదని ప్రభుత్వాలకు...

టీడీపీ వర్చువల్ మహానాడు..!

సాంకేతికత ఉపయోగించుకోవడంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉంటారు. కరోనా కాలంలోనూ ఆయన ఈ సాంకేతిక ఆధారంగానే పనులు చక్క బెడుతున్నారు. జూమ్ యాప్‌ను గరిష్టంగా ఉపయోగించుకుంటున్నారు. మహానాడును కూడా డిజిటల్ మయం...

HOT NEWS

[X] Close
[X] Close