మహిళా దినోత్సవాన మంచు `సుబ్బ`లక్ష్మి

మంచు లక్ష్మి మధ్యతరగతి గృహిణి పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ `మిసెస్ సుబ్బలక్ష్మి`. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో అవసరాల శ్రీనివాస్, మహేష్ విట్టా, జబర్దస్త్ వేణు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. దాదాపుగా చిత్రీఆకారణ పూర్తయ్యింది. వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 8న జీ5 యాప్‌లో, వెబ్‌లో `మిసెస్ సుబ్బలక్ష్మి`ని చూడొచ్చు. మార్చి 8న విడుదల చేయడానికి ఓ కారణం వుంది. ఆ రోజు మహిళా దినోత్సవం. మంచు లక్ష్మి నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. `ఈ గృహిణి ఇంట్లో గందరగోళం సృష్టిస్తుంది మహిళా` అనే క్యాప్ష‌న్‌తో జీ5 టీమ్ `మిసెస్ సుబ్బలక్ష్మి`ని ప్రమోట్ చేస్తుంది. మహిళా దినోత్సవాన మిసెస్ సుబ్బలక్ష్మిగా మంచు లక్ష్మి నెట్టింట్లో ఎంత హంగామా చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com