వరంగల్ , కాజీపేట, హన్మకొండ ఇప్పుడు హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ గా ఉన్నాయి. కాజిపేట రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం మిడ్-సెగ్మెంట్ లెవెల్లో బలంగా నిలబడింది. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత కాజీపేట మరింతగా వృద్ధి చెందుతుంది.
ప్రస్తుతంతో కాజీపేటలో చదరపు గజానికి సగటు ధర రూ. 6,000 వరకూ ఉంది. కోచ్ ఫ్యాక్టరీ ప్రభావంతో ఇది 2027 నాటికి 8,000 వరకు చేరుకోవచ్చు. విద్యా సంస్థలు, హాస్పిటల్స్ మరియు కనెక్టివిటీతో కూడిన రెసిడెన్షియల్ హబ్‌గా కాజీపేట మారుతోంది. ఫ్యాక్టరీ ప్రభావం రెసిడెన్షియల్ డిమాండ్‌ను మాత్రమే కాకుండా, కమర్షియల్ స్పేస్‌లను కూడా పెంచుతుంది. కోచ్ ఫ్యాక్టరీ కారణంగా కాజిపేట చుట్టూ షాపింగ్ మాల్స్, హోటల్స్, లాజిస్టిక్స్ హబ్‌లు మరియు MSME యూనిట్లు ఏర్పడే అవకాశం ఉంది.
ఇప్పటికే మాదికొండ-ధర్మసాగర్ 100 అడుగుల రోడ్డు పక్కన 40 అడుగుల వైడ్ రోడ్లతో కూడిన వెంచర్లు ఉన్నాయి. వరంగల్ ORR నుంచి 500 మీటర్ల దూరంలో ఉండి, IT SEZ రైల్ కోచ్ ఫ్యాక్టరీకి 5 కి.మీ. దూరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేశారు. వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణ పూర్తి కావడం లేదు. ఎయిర్ పోర్టు కూడా నిర్మాణం అయితే మరింత డిమాండ్ వస్తుంది.
