కేసీఆర్ చెప్పింది ఫ్రెంట్ కాదు… కొత్త జాతీయ పార్టీ..!

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన వెంట‌నే… కేసీఆర్ దృష్టి జాతీయ రాజ‌కీయాల‌పై మ‌ళ్లింది! రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కంటే… జాతీయ స్థాయిలో కొత్త ప్ర‌త్యామ్నాయ నిర్మాణం గురించే ఆయ‌న ప్ర‌ముఖంగా మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ కేసీఆర్ చెప్పింది ఏంటంటే… ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్‌. అంటే, కాంగ్రెసేత‌ర‌, భాజ‌పాయేత‌ర పార్టీల‌ను ఒక‌టి చేసే ఒక కూట‌మి అనే అర్ధంలో మాట్లాడారు. అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ, ఇవాళ్ల చెప్తున్న‌ది ఏంటంటే… ఓ నాలుగు పార్టీల‌ను ద‌గ్గ‌ర‌కి చేయాల‌న్న‌ది త‌న ఆలోచ‌న కాద‌ని. ఒక్క మాట‌లో చెప్పాలంటే… ప్రాంతీయ పార్టీల‌తో కూడిన జాతీయ పార్టీ ఆవిర్భావం అనేది కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌గా క‌నిపిస్తోంది. అది కూడా వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లోపే అలాంటిది ఆవిష్కృతం చేస్తా అంటూ ధీమాగా కేసీఆర్ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ‌న‌తా పార్టీ ఉదాహ‌ర‌ణ తీసుకొచ్చారు. అప్పట్లో, దేశంలో ఎమ‌ర్జెన్సీ త‌రువాత కొద్దికాలంలోనే ఓ నాలుగు పార్టీల‌ను ఏకం చేసింది. అదే ప‌ద్ధ‌తితో తాను చేస్తాన‌న్న‌ట్టుగా కేసీఆర్‌ మాట్లాడారు. అయితే, కేసీఆర్ చెప్పిన జ‌న‌తా పార్టీ ఉదాహ‌ర‌ణగా తీసుకుంటే… త‌రువాతి కాలంలో అది ముక్క‌లైపోయిన ప‌రిస్థితి ఉంది. ఆ త‌రువాత‌, వీపీ సింగ్ హ‌యాంలో కూడా ఇలాంటి ప్ర‌య‌త్నం ఒక‌టి జ‌రిగింది. కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన సింగ్ కొన్ని పార్టీల‌ను అప్పుడు ఏకం చేయ‌గ‌లిగారు. ఆ స‌మ‌యంలో టీడీపీ కూడా మ‌ద్ద‌తుగా నిలిచింది. కానీ, పూర్తిగా క‌ల‌వ‌లేదు. అయితే, అలా ఏర్ప‌డ్డ జ‌న‌తా ద‌ళ్ కూడా త‌రువాతి కాలంలో పూర్తిగా ప్రాభవం కోల్పోయింది. గ‌తానుభ‌వాలు చూసుకుంటే… ఇలాంటి ప్ర‌యోగాలకు ఎక్కువ కాలం మ‌నుగ‌డ లేదు. అలాగ‌ని, కేసీఆర్ చేయ‌బోతున్న ప్ర‌య‌త్నం విఫ‌ల‌మౌతుందని చెప్ప‌డం కాదు. గ‌తంలో రెండు సార్లు జ‌రిగిన ప్ర‌య‌త్నాల‌లో లోపాల‌ను గుర్తెరిగి, ఒక కొత్త మోడ‌ల్ తీసుకొస్తే… ఆ ప‌రిస్థితి గ‌తానికి భిన్నంగా ఉంటుందేమో మ‌రి.

అయితే, ఇక్క‌డ కేసీఆర్ చెబుతున్న ప్ర‌త్యామ్నాయ ఏర్పాటుకు కూడా కేవ‌లం కొన్ని నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. లోక్ స‌భ ఎన్నిక‌లు కూడా ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి. రాబోయే మూడు లేదా నాలుగు నెల‌ల్లోనే జాతీయ రాజ‌కీయాల‌కు సంబంధించిన పునాది ఏర్ప‌డాలి. ఇక‌, ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తే… కేంద్రంలో భాజ‌పా, కాంగ్రెస్ ల కొన్ని పార్టీలు మ‌ద్ద‌తుగా ఉంటూ.. రెండు కూట‌ములు ఇప్ప‌టికే ఉన్నాయి. దేశంలో ప్రముఖంగా ఉన్న, లేదా ఉండాలనుకుంటున్న చాలా పార్టీలూ అటో ఇటో చేరి ఉన్నాయి. ఎన్డీయే, యూపీయేల‌కు ప్ర‌స్తుతానికి దూరంగా ఉంటున్న పార్టీలు కొద్ది మాత్ర‌మే ఉన్నాయి. అవి కూడా ఈ రెంటికీ ప్ర‌త్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న‌వి అనీ పూర్తిగా చెప్పలేం. ఈ రెండు కూట‌ముల నుంచి వ‌చ్చే ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్లు కోసం ఎదురుచూస్తున్న‌వారే అన‌డం కూడా కొంత‌వ‌ర‌కూ క‌రెక్టే అవుతుంది. ఇలాంటి ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు, ఈ స్వ‌ల్ప కాలంలో కేసీఆర్ చెబుతున్న మూడో ప్ర‌త్యామ్నాయ ఏర్పాటుకు ఇప్ప‌టికిప్పుడు సుముఖత ఎన్ని పార్టీలు వ్య‌క్తం చేస్తాయి? ఇప్పటికే ఎన్డీయే, యూపీఏ కూట‌ముల్లో ఉన్న పార్టీలు ఏవైనా కేసీఆర్ అజెండావైపు ఆక‌ర్షితులౌతాయా? ఆ స్థాయిలో కేసీఆర్ ప్ర‌భావం ఎలా చూపిస్తారు అనే ప్ర‌శ్న‌లు ప్ర‌స్తుతానికి ఉన్నాయి.

ఇంకోటి.. కేసీఆర్ చెబుతున్న అజెండా కూడా కొన్ని పార్టీల‌ను ప్ర‌స్తుతానికి బాగా ఆలోచన‌లో ప‌డేసేవే. రాష్ట్రానికో సుప్రీం కోర్టు అంటున్నారు. రిజ‌ర్వేష‌న్ల నిర్ణ‌యాధికారాలు కూడా రాష్ట్రాల‌కే ఉండాలంటున్నారు. కేంద్ర ప‌రిధి నుంచి అనేక కీల‌కాంశాల‌ను రాష్ట్రాల‌ను బ‌ద‌లాయించాలంటున్నారు. అంతేకాదు, సుప్రీం కోర్టును ప్ర‌భుత్వమే శాసించేలా అవ‌స‌ర‌మైతే చ‌ట్టం తేవాలంటున్నారు. అంటే, ఇలాంటి ఆలోచ‌న‌ల‌కు ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు కచ్చితంగా ఉండ‌ద‌ని చెప్ప‌డం లేదు. లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు చాలా త‌క్కువ స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో… కేసీఆర్ ఢిల్లీలో వెల్ల‌డించ‌బోయే ఈ త‌ర‌హా అజెండాను… ఇప్ప‌టికిప్పుడు ఆక‌ళింపు చేసుకుని, ఆక‌ర్షితులై చేతులు క‌లిపేవారు ఎంత‌మంది అనేది ప్ర‌స్తుతానికి ఒక మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌గానే ఉంది. దీనికీ కేసీఆర్ ద‌గ్గ‌ర జ‌వాబు ఉంది! తాను గులాబీ జెండా ప‌ట్టుకున్న‌ప్పుడు ఒక్క‌డినేన‌నీ, త‌రువాత సాధించింది ఏంటో తెలిసిందే క‌దా అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close