అపెక్స్ భేటీలో ఏపీ, కేంద్రం నోళ్లు మూయిస్తాం: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. స్నేహహస్తం చాచినా.. కావాలని కయ్యం పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర విధానాలు కూడా సరిగ్గా లేవన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సోమవారం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై..సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఫిర్యాదులు చేసిన ఏపీ ప్రభుత్వ తీరుపై కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ పెద్దలను తనంతట తనే పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడానని … రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించానన్నారు.

బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చాలా స్పష్టంగా చెప్పానని ఈ సందర్భంగా కేసీఆర్‌ గుర్తు చేశారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కయ్యం పెట్టుకుంటోందని, తెలంగాణ ప్రాజెక్టులపై నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా సరిగా లేదన్నారు. తెలంగాణకు ఉన్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని అన్నింటికీ అనుమతులు ఉన్నాయంటున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చిన నీటిని వచ్చినట్లుగా విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తూండటాన్ని నిలిపివేయాలని.. కేఆర్ఎంబీ లేఖలు రాయడంపైనా కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. శ్రీశైలం అసలు సాగునీటి ప్రాజెక్ట్ కాదని…విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టని అంటున్నారు. ఏపీ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ చేపట్టడంతోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదం ప్రారంభమయింది. రెండు రాష్ట్రాలు ఒకరి ప్రాజెక్టులైప ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వివాదం అపెక్స్ కౌన్సిల్ వరకూ వెళ్లింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమిత్‌ షాతో భేటీ కోసం ఢిల్లీకి జగన్..!

ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన పర్యటన హఠాత్తుగా ఖరారయింది. చాలా రోజుల నుంచి ఆయన కేంద్రమంత్రుల్ని కలవాలని అనుకుంటున్నారు. గతంలో రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లిన తర్వాత...

పంపుసెట్లకు మీటర్లను జగన్ ఎందుకు పెడుతున్నారో చెప్పిన హరీష్ రావు..!

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఒక వేళ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభమైతే..రైతులు...

ప్రాయశ్చిత్త హోమాలు చేయాలని ఏపీ సర్కార్‌కు ఆస్థాన స్వామిజీ సలహా..!

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు..హిందూత్వంపై వైసీపీ నేతల అరాచక వ్యాఖ్యలకు పరిహారంగా.. ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలని వైఎస్ జగన్ .. వైసీపీ నేతల ఆస్థాన స్వామిజీ స్వరూపానంద సరస్వతి సూచించారు. వరుస...

రైతులకు ఆ బిల్లులు ఉపయోగపడితే సంబరాలు ఎందుకు చేసుకోరు ?: కేటీఆర్

బిల్లులు ఎలా ఆమోదించుకోవాలో.. ఎలా ప్రజామోదం సంపాదించాలో.. తెలంగాణను చూసి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. కేంద్రం వివాదాస్పదంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేటీఆర్ స్పందన.. అంతే...

HOT NEWS

[X] Close
[X] Close