నీల‌కంఠ‌తో రాజ‌శేఖ‌ర్‌

షో సినిమాతో ఆక‌ట్టుకున్నాడు నీల‌కంఠ‌. మిస్స‌మ్మ త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప‌లు అవార్డులు అందించింది. దాంతో క్లాస్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలంగా నీల‌కంఠ ఖాళీగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ ఓ స్క్రిప్టు ప‌ట్టుకుని రీ ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాడు. రాజ‌శేఖ‌ర్ కోసం ఓ క‌థ త‌యారు చేశాడు నీల‌కంఠ‌. ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. ఈ సినిమా దాదాపుగా ఫిక్స్ అయిపోయిన‌ట్టే అని టాక్‌. `క‌ల్కి` త‌ర‌వాత రాజ‌శేఖ‌ర్ కొన్ని క‌థ‌లు విన్నాడు. త‌మిళ ద‌ర్శ‌కుడితో ఓ సినిమా కూడా క్లాప్ కొట్టుకుంది.కానీ ముందుకు వెళ్ల‌లేదు. వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రికి ఓకే చెప్పాడు. కానీ ఆ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు నీల‌కంఠ లైన్ లోకి వ‌చ్చాడు. నీల‌కంఠ‌పై న‌మ్మ‌కం ఉంచొచ్చు. సినిమా ఆర్థికంగా ఎలాంటి ఫ‌లితాన్ని తీసుకొచ్చినా.. త‌న ప్ర‌య‌త్నం మాత్రం ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకుంటూనే ఉంటుంది. రాజ‌శేఖ‌ర్ కూడా నీల‌కంఠ‌తో ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ల‌డానికే మొగ్గు చూపుతున్న‌ట్టు టాక్‌. త్వ‌ర‌లోనే ఈ కాంబోపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

HOT NEWS

[X] Close
[X] Close