నిరసనల సెగ…! హైదరాబాద్ వరద బాధితులకు రూ. 550 కోట్లు ఇస్తున్న కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరదలకు నష్టపోయిన హైదరాబాద్ వాసుల్ని ఆదుకోవడానికి కార్యాచణ ప్రణాళిక ప్రకటించారు. హైదరాబాద్‌లో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10 వేల సాయం అందించాలని నిర్ణయించారు. మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష ..పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. దెబ్బతిన్న రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆదేశించారు.
మున్సిపల్ శాఖకు రూ. 550 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మొత్తం నుంచి బాధితులందరికీ పరిహారం అందేలా చూస్తారు. భారీ వర్షాలతో హైదరాబాద్‌ ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను కేసీఆర్ ఆదేశఇంచారు. దేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం కురిసిందని.. బస్తీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడ్డారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతే కాదు.. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకు రావాలన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం.. హైదరాబాద్‌కు వరద సాయంగా రూ.10 కోట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రజల తరఫున సానుభూతి ప్రకటిస్తూ కేసీఆర్‌కు పళనిస్వామి లేఖ పంపారు.

హైదరాబాద్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అతి పెద్ద వర్షం కురిసిన తర్వాత రోజూ ఏదో ఓ సమయంలో వాన పడుతూనే ఉంది. ఫలితంగా కాలనీలు ముంపు నుంచి బయటకు రాలేకపోతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేదనే ఆవేదన ప్రజల్లో ఏర్పడింది. ఇది టీఆర్ఎస్ నేతలపై దాడులకు దారి తీస్తోంది. పరామర్శకు వెళ్తున్న కార్పొరేటర్లపై బాధితులు దాడులు చేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో తక్షణం ఉపశమనంగా ఏదో ఓ సాయం చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. నవంబర్‌లోనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న సమయంలో.. ప్రజలు ఎక్కువ ఆగ్రహం గురి కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో సాయాన్ని వేగంగా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“గ్యాగ్” ఆర్డర్స్‌పై సుప్రీం స్టే..!

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో ఎఫ్ఐఆర్‌లో విషయాలను మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే.. ఆ...

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

పెంచుకుంటూ పోయే ప్రక్రియలో ఈ సారి ఆస్తి పన్ను..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు పెంచుకుటూ పోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.. అవకాశం లేకపోయినా స్పేస్ చూసుకుని మరీ పెంచుకుటూ పోతోంది. పెట్రోలో నుంచి టోల్ చార్జీల వరకూ కొత్త కొత్త ఆలోచనలు...

HOT NEWS

[X] Close
[X] Close