ఒక్క బటన్ నొక్కండి – మహారాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పిలుపు !

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత తొలి సారిగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో బహిరంగసభ ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఒక్క బటన్ నొక్కితే దేశమంతా మారిపోతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం చేయమని.. . తల్వార్లు తిప్పమని చెప్పడం లేదని ఒక్క బటన్ నొక్కండి చాలని కేసీఆర్ కోరారు. మహారాష్ట్రలో జరగనున్న జిల్లాల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపాలని రైతులకు పిలుపునిచ్చారు.

మహారాష్ట్రతో తెలంగాణది రోటీ – భేటీ బంధమన్నారు. పది రోజుల్లో శివాజీ సొంత గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. రైతులంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని.. వాటిని ఆపాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎందుకీ దుస్థితి అని ప్రశ్నించారు కేంద్రంలో పార్టీలు మారాయి.. ప్రధానులు మారారని, అయినా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదన్నారు. మన దేశంలో 16 కోట్ల మంది రైతులు ఉన్నారని.. దేశ జనాభాలో రైతులు, వ్యవసాయ కూలీలు 50 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు.రైతులు కేవలం నాగలి దున్నేవాళ్లే కాదు.. చట్టాలు చేసేవాళ్లుగా కూడా ఎదగాలన్నారు.

దేశంలో చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలన్నారు. మేకిన్ ఇండియా కాస్తా జోకిన్ ఇండియా అయిందన్నారు. జీవనదులు ఉన్న మహారాష్ట్రకు కరవెందుకు వచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. మన కిసాన్‌ సర్కార్‌ వస్తే ప్రతి ఎకరాకు సాగునీరు , తాగు నీరు అందుతుందని చెప్పారు. బీడ్‌, లాథూర్‌, పర్బనీ వంటి ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు. రైతులకు ఎంతో చేయాల్సి ఉందన్నారు. దళితులకు రైతు బంధు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సి ఉందన్నారు. ఢిల్లీలో మహారాష్ట్ర సర్కారు రాగానే… తెలంంగాణలో ఉన్న అన్ని పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తామన్నారు.

నాందెడ్‌ ఆదిలాబాద్ శివారులో ఉండటంతో ఆ జిల్లాల నుంచే అత్యధికంగా జన సమీకరమ చేశారు. మరో వైపు పలువురు పార్టీ నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే వీరిలో గుర్తింపు ఉన్న నేతలు తక్కువ. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాల్లో పోటీ గురించి ప్రకటన చేయని కేసీఆర్.. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో బీఆర్ఎస్ తెలంగాణ బయట మహారాష్ట్రలోనే తొలి ఎన్నికల సమయంలో పాల్గొనబోతున్నట్లుగా స్పష్టమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close