ప్ర‌శాంత్ వ‌ర్మ‌… మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌!

కొత్త త‌ర‌హా క‌థ‌లు ఆలోచించ‌డంలో ప్ర‌శాంత్ వ‌ర్మ దిట్ట‌. ఆ, క‌ల్కి, జాంబిరెడ్డి… ఇలాంటి సినిమాలే. హ‌ను – మాన్‌తో ఫాంట‌సీకి మైథ‌లాజిక‌ల్ ట‌చ్ ఇస్తున్నాడు. తేజా స‌జ్జా హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. ఇప్పుడు మ‌రోసారి త‌న కథ‌కు మైథ‌లాజికల్ ట‌చ్ ఇచ్చాడు. `హీరో` ఫేమ్ జ‌య‌దేవ్ గ‌ల్లా రెండో సినిమా మొద‌లెట్టాడు. అర్జున్ జంథ్యాల ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి ప్ర‌శాంత్ వ‌ర్మ‌నే క‌థ అందించాడు. ఇది మాస్ సినిమానే. కాక‌పోతే.. దానికి మైథ‌లాజిక‌ల్ అంశాలూ ముడి వేశాడు. హీరో సినిమా అనుకొన్నంత ఫ‌లితం తీసుకురాక‌పోవ‌డంతో, రెండో సినిమాపై బాగా ఫోక‌స్ చేశాడు జ‌య‌దేవ్ గ‌ల్లా. దాదాపు వంద క‌థ‌లు విన్న త‌ర‌వాత‌.. ప్ర‌శాంత్ వ‌ర్మ చెప్పిన క‌థ‌ని ఓకే చేశారు. ద‌ర్శ‌కుడు అర్జున్ జంథ్యాల ఇది వ‌ర‌కు `గుణ 369` తీశాడు. ఆ సినిమా స‌రిగా ఆడ‌లేదు కానీ, మేకింగ్ ప‌రంగా బాగుంటుంది. చివ‌ర్లో ట్విస్టు కూడా ఆక‌ట్టుకొంటుంది. పైగా అర్జున్ బోయ‌పాటి శ్రీ‌ను శిష్యుడు. బోయ‌పాటి లా హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయ‌గ‌ల‌డు. అందుకే ఈ క‌థ‌ని.. అర్జున్ చేతిలో పెట్టారు. ఈరోజే హైద‌రాబాద్‌లో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. హీరోయిన్‌, విల‌న్ పాత్ర‌ల కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close