పాకీజాకు సాయం అందించిన చిరు, నాగబాబు! మోహన్ బాబు స్పందించరా ?

తెలుగు సినీ ప్రేక్షకులను 90వ దశకంలో అలరించిన పాకీజా ప్రస్తుతం దుర్భర జీవితాన్ని గడుపుతోంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న తరువాత చిరంజీవి నాగబాబు సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే..

పాకీజా అన్న స్క్రీన్ నేమ్ కలిగిన వాసుకి 90వ దశకంలో అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం పంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే వివాహం చేసుకున్న తర్వాత భర్త శాడిస్ట్ మరియు తాగుబోతు కావడంతో జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంది. దీనికి తోడు అనేక ఆరోగ్య సమస్యలు రావడంతో సంపాదించుకున్న కాస్త డబ్బులు కూడా అయిపోయి ప్రస్తుతం ఒక హాస్టల్ లో నివసిస్తూ కాలం గడుపుతుంది. సోషల్ మీడియాలోని ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, తినడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసిన నాగబాబు తన వంతుగా లక్ష రూపాయలు సహాయం అందించారు. పాకీజా కూడా సహాయం తీసుకున్న తర్వాత నాగబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఆవిడ పరిస్థితి తెలియడంతో చిరంజీవి కూడా లక్ష రూపాయలు సాయం అందించడమే కాకుండా, అవకాశాలు ఇవ్వాల్సిందిగా సినీ మరియు టీవీ సీరియల్ దర్శకులకు విజ్ఞప్తి చేశారు. ఆవిడకు మళ్ళీ అవకాశాలు వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు.

మెగా బ్రదర్స్ చేసిన ఈ చిరు సాయాన్ని నెటిజన్లు కూడా ప్రశంసించారు. అయితే ఈ సందర్భంగా వారి చర్చలలో, పాకీజా చిరంజీవితో ఏ సినిమాలోనూ నటించలేదని, ఆవిడ ప్రధానంగా మోహన్ బాబు సినిమాలలో నటించారని, ఆవిడ పరిస్థితి తెలిసి కూడా మోహన్ బాబు ఎందుకు సాయం అందించడం లేదనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. అయితే నిజానికి కమర్షియల్ రంగం అయిన సినిమా పరిశ్రమలో సాయం చేసి తీరాలన్న రూల్ లేదు. అయితే,మోహన్ బాబు సినిమాలైన అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం వంట సినిమాలు సూపర్ హిట్స్ కావడం లో పాకీజా పాత్ర కూడా ఎంతో ఉందని గుర్తు చేస్తూ, తాను ఇండస్ట్రీ పెద్దను అని చెప్పుకోవడానికి ఉబలాటపడే మోహన్ బాబు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న మంచి విష్ణు లు ఇలా సాయం చేయవలసి వచ్చిన సందర్భాలలో మాత్రం ఎందుకో వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉంటారని సెటైర్లు విసురుతున్నారు నెటిజన్లు.

ఏది ఏమైనా, పాకీజా పరిస్థితి మెరుగుపడాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“ఆహా” ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ !

ప్రముఖ ఓవర్ ది టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన...

ఇప్పుడు “మంత్రుల టిక్కెట్లు” చింపే ధైర్యం ఉందా !?

ముగ్గురు, నలుగురు టిక్కెట్లు చినిగిపోతాయని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలోనే మంత్రుల్ని హెచ్చరించారు. ఆ తర్వాతి రోజే ఎవరెవర్ని తీసేస్తారు.. ఎవరెవర్ని తీసుకుంటారు అనే లీకులు కూడా సజ్జల క్యాంప్ నుంచి...

ప్రభం”జనం”లా మారుతున్న లోకేష్ పాదయాత్ర !

లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ రోజుకారోజూ అంచనాలకు అంతనంత మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా గోరంట్లలో లోకేష్ పాదయాత్రలో...

ఏపీ పేరును ” వైఎస్ఆర్‌ ఏపీ ” అని మార్చేశారా !?

ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే... ఏపీ అని ప్రారంభిస్తుంది. అంటే ఏపీ భవన నిర్మాణ విధానం, ఏపీ పారిశ్రామిక విధానం,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close