ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్‌కా ?

ఎమ్మెల్యేలు ఎర కేసులో సోమవారం హైకోర్టు తీర్పు రానుంది. ఈ కేసు సీబీఐకి ఇవ్వాలా వద్దా అన్నది హైకోర్టు డిసైడ్ చేయనున్నది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్ని కీలక మలుపు తిప్పనుంది.ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి ఇవ్వాలన్న సింగిల్ జడ్జ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. సీబీఐ వెంటనే రంగంలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే సంచలనం నమోదవుతుంది. ముందుగా … ఫిర్యాదు చేసిన వారిని ప్రశ్నించవచ్చు. ఈ కేసులో చెబుతున్న రూ. వందల కోట్ల డీల్స్ కు నిధులు ఎక్కడివని.. బయటకు తీసే అవకాశం ఉంది. నిజానికి సీబీఐకి కేసు వెళ్తే ఎలాంటి మలుపులు తిరుగుతుదో అంచనా వేయడం కష్టం. కానీ ఒక్కటి మాత్రం నిజం. అది బీజేపీ నేతలవైపు కాదు.. .ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల వైపే విచారణ గురి పెట్టి ఉంటుంది.

ఒక వేళ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును పక్కన పెడితే.. సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. అప్పుడు గతంలో ప్రారంభించిన విచారణకు కొనసాగింపు ఉంటుంది. అది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే కీలక నేతలకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు న్యాయవివాదాల్లో ఉన్నాయి. హైకోర్టు విచారణకు పర్మిషన్ ఇస్తే మరోసారి అన్నీ ముందుకు వస్తాయి. కేసులో ఎలాంటి తీర్పు వచ్చినా విషయం సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఎక్కువ చాన్స్ ఉంది. సీబీఐకి ఇస్తే తెలంగాణ ప్రభుత్వం.. సిట్ కు ఇస్తే… నిందితులూ అదే పని చేస్తారు. అయితే తీర్పు మాత్రం సంచలనంగా మారడం ఖాయం అని అనుకోవచ్చు.

అయితే ఈ కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నెమ్మదిగా ఉంటున్నాయి. సీబీఐ విచారణపై హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు. కానీ సీబీఐ మాత్రం ఇంకా విచారణ ప్రారంభించలేదు. ఈ కేసుపై తెలంగాణ ప్ర‌భుత్వం హైకోర్టు డిజిజ‌న్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది కనుక తీర్పు వచ్చే వరకూ చూడాలని నిర్ణయించుకున్నట్ుగా తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో కేసు నమోదు చేశారని.. ఒక్క సారి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే విరుచుకుపడుతారని అంటున్నారు. ఏం జరిగినా సోమవారం నుంచి కీలక ఘటనలో చోటు చేసుకునే అవకాశం ఉంది. .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close