దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ ఎంత నమ్మకమో..!?

దుబ్బాక ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేసీఆర్.. దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడైపోయిందని తేల్చారు. దుబ్బాక ఎన్నికలు మాకు పెద్ద లెక్కే కాదని..మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ చిల్లర తతంగాలుగా తేల్చారు. ఎన్నికలు జరిగే వరకూ నడుస్తూనే ఉంటాయని వాటిని పట్టించుకోబోమని తేల్చేశారు. గ్రౌండ్‌ చాలా క్లియర్‌గా ఉందన్నారు. అయితే దుబ్బాకలో ప్రచారం హోరెత్తిపోతోంది.

బీజేపీ దూకుడు మీద ఉంది. బీజేపీలో గుర్తింపు ఉన్న ప్రతీ నేతా దుబ్బాకలో తిరిగేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రెండు రోజుల పాటు పర్యటించబోతున్నారు. దుబ్బాకలో డబ్బులు దొరకడం.. ఇతర అంశాలు వివాదాస్పదం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకుంది. ప్రత్యేకంగా పరిశీలకుడ్ని పంపించింది. కేంద్ర బలగాలు కూడా దుబ్బాకకు చేరుకున్నాయి. ఎన్నికల సమయంలో… అధికార అండతో టీఆర్ఎస్ అక్రమాలకు చేయకుండా ఉండటానికి కేంద్రంలో తమకు ఉన్న అధికారంతో బీజేపీ ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పరిస్థితి రాను రాను ఉద్రిక్తతంగా మారుతోంది. మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరి ప్రచారం వారు జోరుగా చేసుకుంటున్నారు. కానీ బయట మాత్రం సీన్‌లో బీజేపీ, టీఆర్ఎస్ మాత్రమే కనిపిస్తున్నాయి. కేసీఆర్ పూర్తి ధీమాతో ఉన్నందున… ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. ఫలితం ఎలా ఉన్నా.. మొత్తంగా హరీష్ రావే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close