చంద్రబాబు రాసిన లేఖల్ని ఎవరైనా చూశారా..?

ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… రెండో విడత ప్రచార పర్వాన్ని ప్రారంభించినప్పుడు.. ఓ లేఖను గాల్లోకి తిప్పుతూ ఆవేశపడ్డారు. అది ఖమ్మం జిల్లాలోని సీతారామా ప్రాజెక్టును నిలిపి వేయాలని కేంద్రాన్ని కోరుతూ.. చంద్రబాబు రాసిన లేఖ అని… కేసీఆర్ చెప్పుకొచ్చారు. నిజమా … అయితే అదో పెద్ద సంచలనం అవడం ఖాయం అనుకున్నారు అందరూ..! కానీ ఆ లేఖ ఇంత వరకూ బయటకు రాలేదు. దాన్ని చూసిన వారు కూడా ఎవరూ లేరు. నిజంగా … అలాంటి లేఖ చంద్రబాబు రాసి ఉంటే … తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన గెజిట్ పత్రిక లాంటి.. నమస్తే తెలంగాణ దాన్ని .. తెలంగాణలోని ప్రతి గ్రామంలో … ప్రదర్శించి ఉండేది. కానీ.. అలాంటి ప్రయత్నమేమీ జరగలేదు. అంతే కాదు… చంద్రబాబును టార్గెట్ చేసుకుటూ.. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రతి ప్రాజెక్టుపైనా… అడ్డుకునేలా కేంద్రానికి లేఖలు రాస్తున్నారని… టీఆర్ఎస్ నేతలు పదే పదే వాదిస్తున్నారు. హరీష్ రావు అయితే .. రెండు అడుగులు ముందుకు వేసి.. చంద్రబాబు లేఖలు వెనక్కి తీసుకోవాలని… క్షమాపణ చెప్పాలని కూడా .. డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేలా… తాను ఎటువంటి లేఖలు రాయలేదని.. చంద్రబాబు తన ప్రచారంలో చెప్పుకొస్తున్నారు. ఎగువ రాష్ట్రం – దిగువ రాష్ట్రం మధ్య నీటి వివాదాలు కామనే కాబట్టి… మాట్లాడుకుని పరిష్కరించుకుందాం అంటున్నారు. కానీ.. టీఆర్ఎస్ మాత్రం.. ఆ లేఖల ప్రస్తావనే ఇంకా తెలుస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎలాంటి లేఖలు వేసినా… నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో అదో పెద్ద సీన్ అవుతుంది. అనుమతులు అంత త్వరగా రావు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు తీర్చిన తర్వాతే పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వాల్సిఉంటుంది. కానీ… తెలంగాణ ప్రభుత్వానికి అటు కాళేశ్వరం ప్రాజెక్టుకి కానీ ఇటు సీతారామ ప్రాజెక్టుకి కానీ… ఏ అనుమతులు.. ఏపీ రాసిన లేఖల వల్ల పెండింగ్‌లో లేవు. ఆ విషయం టీఆర్ఎస్‌కు కూడా బాగా తెలుసు. అయినప్పటికీ.. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖలు… ప్రత్యేకంగా ఏ ప్రాజెక్టునూ ఉద్దేశించినవి కాదు.. విభజన చట్టం ప్రకారం.. ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికి అయిన అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని ఉంటుంది. దాని ప్రకారమే లేఖలు రాశారు. అదేదో… తెలంగాణ ప్రాజెక్టులు నిలిపివేయాలని.. టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కానీ తెలంగాణ వాదుల్లో మరింత సెంంటిమెంట్ పెంచుతుందేమో కానీ… దాని వల్ల టీఆర్ఎస్‌కు వచ్చే లాభం ఏమీ ఉండదనేది… టీడీపీ నేతల అంచనా…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com