ఇండిపెండెన్స్ డే స్పీచ్‌లోనూ కేంద్రంపై కేసీఆర్ విమర్శలు !

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరించిన తర్వాత చేసిన ప్రసంగంలోనూ కేంద్రంపై విమర్శలు చేశారు. స్పీచ్ చాలా వరకూ రాజకీయాంశాల జోలికి వెళ్లలేదు. కానీ చివరిలో కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేస్ోతందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం మొండి చేయి చూపిస్తోందంటూ మండిపడ్డారు.

అలాగే ఢిల్లీ రైతుల ఉద్యమం గురించీ ప్రస్తావించారు. రైతుల ఉద్యమంతో కేంద్రం రైతు నల్ల చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. టాక్సుల పేరిట జనాన్ని దోచుకుంటోందని విమర్శించారు. చిన్న పిల్లలు తాగే పాలు, స్మశాన వాటిక నిర్మాణంపై కేంద్రం ఎడాపెడా పన్నులు వేస్తోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉచితాలపై కేంద్రం రాష్ట్రాలను అవమనిస్తోందన్నారు. కేంద్రం తీరు వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలన్నీ ఎప్పుడు మీడియాతో మాట్లాడినా చేసేవే. అయితే ఈ సారి ఇండిపెండెన్స్ డే వేడుకల్లోనూ అవే ఆరోపణలు చేయం చర్చనీయాంశమవుతోంది.

సాధారణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాజిటివ్ స్పీచ్‌లు ఉంటాయి. ఒక వేళ ఇబ్బంది అనిపిస్తే ప్రస్తావించడం మానేస్తారు… కానీ రాజకీయాలు పెద్దగా చేయరు. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం అన్యాయాన్ని ఈ వేడుక సాక్షిగా వెల్లడించాచారు. దీనిపై సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close