జగన్‌కు ఝలక్ ఇచ్చిన కేసీఆర్: వైఎస్‌పై తీవ్ర విమర్శలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు తీసుకున్న కృతజ్ఞతకూడా లేకుండా వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతర్‌రాష్ట్ర వివాదానికి వైఎస్సే కారణమని ఆరోపించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో కడెం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ సభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమ హయాంలో నాలుగువేల కోట్లు జేబులో వేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు కడితే కాలువలు లేవని, కాలువలు కడితే ప్రాజెక్టులు లేవని అన్నారు. వారు నకిలీ ప్రాజెక్టులు కట్టారని, ఇకమీదట అలా ఉండబోవని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ళ విషయంలో వైఎస్ కొంప ముంచారని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్‌తో అంటకాగటంపై ఏపీకి చెందిన తెలుగుదేశం నేతలు తీవ్రవిమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు, ఏపీకి అన్యాయం జరగటానికి కారణమైన టీఆర్ఎస్ పార్టీతో జట్టుకడుతున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిచ్చారని ఆరోపించారు. జగన్ దానికి బదులిస్తూ తాను ఏపార్టీతో వెళితే మీకేంటని ప్రశ్నించారు కూడా. అయితే ఇప్పుడు యాంటీ క్లైమాక్స్‌లాగా మద్దతు తీసుకున్న పార్టీయే తమను విమర్శించటం జగన్‌కు ఇబ్బంది కలిగించే విషయమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేటర్ ఎగ్టిట్‌ పోల్స్‌లో కారుదే హవా..!

గ్రేటర్ ఎన్నిల్లో ఎగ్జిట్స్ పోల్స్ అంచనా ప్రకారం... తెలంగాణ రాష్ట్ర సమితికే మెజార్టీ స్థానాలు దక్కనున్నాయి. వివిధ సర్వేలు.. టీఆర్ఎస్‌కే అత్యధిక స్థానాలు కట్టబెట్టాయి. పీపుల్స్ పల్స్ అనే సంస్థ విడుదల చేసిన...

రివ్యూ: ‘బొంభాట్‌’

వేర్ ద లాజిక్ స్టార్స్ట్‌... డ్రామా ఎండ్‌, వేర్ ద డ్రామా స్టార్ట్స్ .. లాజిక్ ఎండ్‌ - అని హిచ్ కాక్ అనే ఓ పెద్దాయ‌న చెప్పాడు. లాజిక్‌వేసుకుంటూ వెళ్లిన చోట...

ర‌జ‌నీ మ్యాజిక్ చేయ‌గ‌ల‌డా??

రజనీకాంత్ రాజకీయం ఇప్పటి మాట కాదు. మూడు దశాబ్దాల నుంచి నానుతోంది. కానీ రజనీ మాత్రం ''దేవుడు ఆదేశిస్తాడు' అనే సినిమా డైలాగులతోనే సరిపెట్టేశారు. అయితే ఎట్టకేలకు రజనీ నుంచి పొలిటికల్ పార్టీ...

“తాపీ దాడి” కేసులో కొల్లు రవీంద్రకు నోటీసులు..!

మచిలీపట్నం పోలీసులు తాపీ దాడి కేసును మెల్లగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర వద్దకు తీసుకెళ్తున్నారు. ఆయనకు సెక్షన్ 91 కింద నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని...

HOT NEWS

[X] Close
[X] Close