ఈ సారి కేసీఆర్ టీం మార్పు ఖాయమే..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మంత్రి పదవుల ఖాళీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి గతంలో కేటీఆర్ పట్టాభిషేకంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగినప్పుడు… మంత్రుల్లో సగానికి పైగా ఉద్వాసన పలికేసి..కేటీఆర్ కొత్త టీంతో ప్రభుత్వం ఏర్పడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆరే కొనసాగాలని నిర్ణయించుకోవడంతో… మంత్రుల్లో మార్పులు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొంత మంది మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. అలాగే మరికొందరి తీరు వివాదాస్పదమయింది. ఈ కారణంగా ఆయన నలగురు.. ఐదుగురు మంత్రుల్ని తీసేసికొత్త వారికి చాన్సివ్వాలని అనుకుంటున్నారు.

తెలంగాణ మంత్రివర్గంలో కొంత మంది వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఓ రియల్టర్‌ను వాటాల కోసం బెదిరించిన ఆడియో టేప్ వైరల్ అయింది. ఇప్పటికే కేసీఆర్‌తో ఈటెల రాజేందర్‌కు గ్యాప్ పెరిగిపోయిందని చెబుతున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ అనుబంధ మీడియా సంస్థలుగా పేరు పడిన చానళ్లలో కొంత మంది మంత్రులకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలన్నీ పక్కా ప్రణాళిక ప్రకారమే వేస్తున్నారని.. వాటిల్లో ఉన్న మంత్రులకు పదవీ గండమేననడానికి సూచనలని అంటున్నారు. అశావహులు కూడా.. ఎక్కువగానే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఉద్యమకారులకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదన్న అభిప్రాయం పెరగడంతో.. దాన్ని తగ్గించేందుకు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో కేసీఆర్ కొత్త ఫార్ములాను ప్రయోగించే అవకాశం ఉందంటున్నారు.

రాజకీయంగా కేసీఆర్ ఇప్పుడు గేర్ మార్చాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. రెండు వైపులా పదునున్న కత్తి తరహాలో బీజేపీ, కాంగ్రెస్‌లను పరిమితం చేస్తూ… టీఆర్ఎస్ బలాన్ని కాపాడుకోవాల్సి ఉంది. ఇప్పుడు కేసీఆర్ చేయాల్సింది కొత్త వర్గాలను ఆకట్టుకోవడం కాదు.. ఉన్న వర్గాల్లో అసంతృప్తి పెరగకుండా చేసుకోవడం. మినీ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టి.. ఆ దిశగా తన రాజకీయ వ్యూహాల్ని అమలు చేసే అవకాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close