ఆ కేసులో మోపిదేవికి శిక్ష ఖాయమా..!?

హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టులో వరుసగా జరుగుతున్న విచారణల్లో చాలా వరకూ కేసుల్ని కొట్టేస్తున్నారు. కాకపోతే.. అవన్నీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులు. కానీ ఓటుకు నోటు…లిక్కర్ స్కాం లాంటి కేసుల్లో మాత్రం అభియోగాల నమోదు.. సాక్ష్యాల నమోదు చేపడుతున్నారు. లిక్కర్ స్కాంలో సాక్ష్యాలను ప్రజాప్రతినిధుల కోర్టు నమోదు చేసింది. ఈ కారణంగా ఏపీలో కొంత మంది నేతల్లో ఉలికిపాటు ప్రారంభమయింది. దీనికికారణం ఈ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్నది రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణపై.. జగన్ అక్రమాస్తుల కేసే కాదు..మద్యం సిండికేట్ల నుంచి లంచం పుచ్చుకున్న కేసు కూడా విచారణలో ఉంది. వైఎస్ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా మోపిదేవి పని చేశారు. తర్వాత కిరణ్ సీఎం అయిన సమయంలో మద్యం సిండికేట్ వ్యవహారం బయటపడింది. రాజకీయ నాయకులు, ఎక్సైజ్,పోలీస్, మీడియా ఇలా వివిధ వర్గాలవారికి మద్యం సిండికేట్ల నుంచి డబ్బు అందుతోందని ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్ లో ఈ వ్యవహారం బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులకు కిరణ్ ఆదేశించారు. వందమందికిపైగా శాసనసభ్యులు, పది నుంచి ఇరవై మంది మంత్రులు , కొందరు ఎమ్.పిలు, ఎమ్మెల్సీలు ఇలా పార్టీలతో సంబంధం లేకుండా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అంతా పంచుకున్నారని దర్యాప్తులోవెల్లడైంది.

ఏకంగా అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు మద్యం సిండికేట్ల పంచాయతీ తీర్చి పది లక్షల రూపాయల లంచం తీసుకున్నారని ఏకంగా ఒక నిందితుడు చెప్పారు. అది కోర్టుకు సమర్పించిన రిమాండ్ డైరీలోనే రాశారు. అప్పుడు మోపిదేవి పదవిలోనే ఉన్నారు. అప్పట్లో పీసీసీ చీఫ్ గా బొత్స ఉండేవారు. ఆయన మద్యం సిండికేట్‌లో కీలకంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన పేరు ఇందులో రాలేదు. తర్వాత మోపిదేవి జగన్ పార్టీలో చేరారు. ఈ కేసుకు సంబంధించి జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైలులో ఉన్న మోపిదేవిని అప్పట్లో ఏసీబీ అధికారులు ప్రశ్నించారు కూడా. 2015లో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు.

ఇప్పుజు లిక్కర్ సిండికేట్ స్కాం కేసులో సాక్షుల నుంచి కోర్టు స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. తదుపరి విచారణ పదిహేనో తేదీకి వాయిదా వేశారు. పదిహేనో తేదీ తర్వాత ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close