పొర‌పాటున కూడా ఆ మాట చెప్ప‌లేద‌న్న కేసీఆర్!

మ‌ళ్లీ ఇంటికో ఉద్యోగాల టాపిక్ వ‌చ్చింది! తెలంగాణ వ‌స్తే ఇంటికో కొలువు వ‌స్తుంద‌ని ఉద్య‌మ స‌మ‌యంలో సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్టుగా క‌థ‌నాలు, వార్త‌లు చాలా ఉన్నాయి. అయితే, అలా తాను చెప్ప‌లేద‌ని గ‌తంలో ఓసారి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే మాట అసెంబ్లీలో మ‌రోసారి చెప్పారు. వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్ప‌కుండా గోల్ మాల్ చేస్తే వ‌చ్చేది ఏంద‌ని స‌భ‌లో మాట్లాడుతూ ఓ సంద‌ర్భంలో కేసీఆర్ చెప్పారు. ఇవ్వ‌లేని ఉద్యోగాల‌ను ఇస్తామ‌ని భ్ర‌మించేలా చేసి ప్ర‌భుత్వం ఎందుకు చెప్పాల‌ని ప్ర‌శ్నించారు! పొర‌పాటున కూడా నేను ఆ మాట చెప్ప‌లేదు అధ్య‌క్ష్యా అన్నారు.

తెలంగాణ ఉద్య‌మ సంద‌ర్భంలో కూడా ఆ మాట చెప్ప‌లేద‌నీ, వాస్త‌వ ప‌రిస్థితులు త‌న‌కు తెలుసు కాబ‌ట్టి ఆ మాట మాట్లాడ‌లేద‌న్నారు ముఖ్య‌మంత్రి. బాగా ఆలోచించాను కాబ‌ట్టే ఇంటికో ఉద్యోగం వ‌స్తుంద‌ని చెప్ప‌లేద‌న్నారు. అయితే, ఒక మాట తాను చెప్పాన‌నీ… ఇత‌ర ప్రాంతాల ఉద్యోగులు మ‌న హ‌క్కుల్ని హ‌రించారు కాబ‌ట్టి, మ‌న రాష్ట్రం మ‌న‌కు వ‌స్తే ల‌క్షమందికి ఉద్యోగాలు దొరుకుతాయ‌ని చెప్పాను అన్నారు. చెప్పిన‌ట్టుగానే ఇప్పుడు దొరుకుతున్నాయ‌న్నారు. ఇప్ప‌టికే యాభై అరవైవేల మందికి ఉద్యోగాలు వ‌చ్చాయ‌న్నారు. ఇంకా కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయ‌న్నారు. ఎన్నెన్ని ఉద్యోగాలు వ‌చ్చాయో స‌భ‌కు లెక్క‌లు ఇస్తాన‌న్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని మా మేనిఫెస్టోలో ఉందా అని ప్ర‌శ్నించారు. నేను చెప్పిన‌ట్టు స్పీచ్ ఉందా, వాగ్దానం చేసిన‌ట్టు ఆధారాలున్నాయా అన్నారు!!

పొర‌పాటున కూడా ఆ మాట చెప్ప‌లేద‌ని కేసీఆర్ ఇప్పుడు అంటున్నారు! కానీ, యూట్యూబ్ లో ఆ మాటల వీడియోలు దర్శమిస్తాయి. కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం క‌ల్పిస్తాన‌ని మ‌న‌వి చేసుకుంటా అంటూ కేసీఆర్ మాట‌లున్నాయి. ప్రతీ ఇంటికొక ఉద్యోగం వ‌స్త‌ది అని గట్టిగా చెప్పిన సంద‌ర్భాలూ ఉన్నాయి. ఠాట్… అలా అన్లేదు, అన్న‌ట్టు చూపిస్తారా అని ముఖ్య‌మంత్రి ప‌దేప‌దే మాట్లాడుతుంటే ఏమ‌నుకోవాలి? అయినా ఎందుకీ చర్చ..? ప‌్ర‌తీ ఇంట్లో ఒక‌రికి ఏదో ఒక మార్గంలో ఉపాధి క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశామ‌నండీ, అదీ ఉద్యోగ‌మే క‌దా అంటూ తిప్పి చెప్పండి త‌ప్పేముంది? అంతెందుకు… ఈ టాపిక్ తెర మీదికి తీసుకురాకండి, ఏ గొడ‌వా ఉండ‌దు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘మ‌నం 2’ – రంగం సిద్ధం చేస్తున్నారా?

అక్కినేని కుటుంం అంటే విక్ర‌మ్ కె.కుమార్‌కీ, విక్ర‌మ్ అంటే అక్కినేని కుటుంబానికి ప్ర‌త్యేక అభిమానం. `మ‌నం` లాంటి సినిమా ఇచ్చి... అక్కినేని వంశానికి తీయ్య‌టి జ్ఞాప‌కం మిగిల్చాడు విక్ర‌మ్‌. అందుకే `హ‌లో`...

ఇక రైతుల ఉద్యమంపై ఉక్కుపాదమేనా..!?

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులుచేస్తున్న ఉద్యమం హింసాత్మకమయింది. రిపబ్లిక్ డే రోజున రైతు సంఘాలు చేపట్టిన ర్యాలీ దారి తప్పింది. కొంత మంది ఎర్రకోటపైకి ఎక్కి సంబంధం లేని జెండాలు ఎగురేశారు. మరికొంత...

తెలంగాణ ఉద్యోగులకు అన్‌ ” ఫిట్‌మెంటే “

తెలంగాణ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ నివేదిక వారికి షాకిచ్చింది. కేవలం 7.5శాతం ఫిట్‌మెంట్ మాత్రమే సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాలు కనీసం 30 నుంచి 40శాతం...

కేరళ, బెంగాల్ గవర్నర్లు అలా.. .. ఏపీ గవర్నర్ ఇలా..!

గవర్నర్ రాజ్యాంగాధిపతి. రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే జోక్యం చేసుకోవాల్సింది ఆయనే. ఆయనకు అలాంటి అధికారాలు ఉన్నాయి కాబట్టే... బెంగాల్, కేరళ వంటి చోట్ల.. ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదులు పంపుతున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close