మీడియా చానళ్లే “ఏబీ”కి షాకులిచ్చేస్తాయి..!

ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరవుకు కేంద్రం షాకిచ్చిందని.. కొన్ని మీడియా చానళ్లు హడావుడి చేశాయి. కాసేపటికి సైలెంటయ్యాయి. నిజానికి ఇలాంటి షాకులు.. ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండే తింటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన షాకేం లేదు. అందుకే వెంటనే తేరుకుని.. బ్రేకింగ్‌లు .. ఆపేశాయి. ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ పై క్యాట్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపిన క్యాట్ తీర్పు రిజర్వ్ చేసింది. తాము కేంద్రానికి చెప్పామని.. ఏపీ తరపు న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న ఆరోపణలతో పాటు.. సస్పెన్షన్ ఫలానా కారణాల వల్ల విధిస్తున్నామని చెబుతూ.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది.

రాష్ట్రం రాసిన లేఖను సంబంధిత విభాగం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. సర్వీసు నిబంధనల ప్రకారం వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ధ్రువీకరిస్తున్నామని హోంశాఖ వెల్లడించింది. ఇది నిబంధనల ప్రకారం రొటీన్ ప్రక్రియ. అయితే.. మీడియా చానళ్లు మాత్రం.. ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారని కేంద్రం కూడా నిర్ధారించిందంటూ… హడావుడి చేసేశాయి. ఇందులో కేంద్రం ఎక్కడా ఆ విషయాలను ప్రస్తావించలేదు. కేవలం రాష్ట్రం ఆయా ఆరోణలు చేస్తూ సస్పెన్షన్ వేటు వేసిందని చెబుతూ… ఏప్రిల్‌ 7లోగా అభియోగపత్రం దాఖలు చేయాలని రాష్ట్రానికి సూచించింది.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చేయడానికి చాలా తీవ్రమైన కారణాలను ప్రభుత్వం చెప్పింది. వాటిపై ఇప్పుడు ఆధారాలతో సహా చార్జిషీట్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఏబీ వెంకటేశ్వరావు వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చార్జిషీటు దాఖలు చేయకపోతే… కక్షపూరితంగా తీసుకున్న చర్యలుగా పరిగణించే పరిస్థితులు ఏర్పడతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close