టాలీవుడ్ పెద్దలకు తీపి కబురు చెప్పి పంపిన కేసీఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ సినిమా షూటింగ్‌లు వచ్చే నెల నుంచి ప్రారంభించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత మరో వారం.. రెండు వారాల్లో ధియేటర్లనూ ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పిస్తారని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నారు. ఒకటో తేదీ తర్వాత ప్రజా రవాణా అంతా సాధారణ స్థితికి చేరుకుంటుంది. లాక్ డౌన్ కొనసాగించే అవకాశం లేకపోవడంతో.. మాల్స్, ధియేటర్లకూ పర్మిషన్ వస్తుందని నమ్ముతున్నారు. కేంద్రం ఇచ్చినా..రాష్ట్రం కరుణించాల్సి ఉంటుంది.. కేసీఆర్ సానుకూలంగా ఉండటంతో ధియేటర్లు కూడా ఓపెన్ అవుతాయని పరిశ్రమ పెద్దలు నమ్ముతున్నారు. తనతో భేటీ అయిన సినీ ప్రముఖులకు కేసీఆర్ ఈ మేరకు భరోసా ఇచ్చారు.

సినిమా షూటింగ్‌లు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని … వీలైనంత తక్కువ మందితో షూటింగ్‌లు నిర్వహించుకోవాలని కేసీఆర్ సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న పనులు మొదట ప్రారంభించుకోవాలని.. జూన్‌లో సినిమా షూటింగులు ప్రారంభించాలన్నారు. చివరగా పరిస్థితిని బట్టి సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌తో భేటీపై చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా, టీవీ, డిజిటల్ మీడియా సమస్యలపై కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని… సినీ కార్మికులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకుంటారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ ఈ విషయంలో సినీ పరిశ్రమకు వీలైనంతగా సాయం చేస్తున్నారు. పలుమార్లు సినీ పెద్దలతో భేటీ అయ్యారు. విధివిధానాలు ఖరారవ్వగానే..సినిమాలు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఎక్కువ మందితో షూటింగ్ చేసే సీన్లు తక్కువ ఉంటాయని… తక్కువ మందితో షూటింగ్ చేసేవే ఎక్కువ ఉంటాయని.. అలాంటి వాటిని చిత్రీకరించుకునే అవకాశం ఇవ్వాలని రాజమౌళి ముందు నుంచీ తన అభిప్రాయాన్ని చెబుతున్నారు. దీనికే కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అవసరం  : రామ్మాధవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని..  దాన్ని భర్తీ చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు.. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు...

చిరు మాస్టర్ ప్లాన్

ఆచార్య త‌ర‌వాత‌.. భారీ లైన‌ప్ అట్టి పెట్టుకున్నాడు చిరంజీవి. ఓ వైపు బాబీకి ఓకే చెప్పిన చిరు, మ‌రోవైపు మెహ‌ర్ ర‌మేష్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇంకోవైపు వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి...

అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్

`సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఎవ‌రితో అన్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అగ్ర హీరోలంతా బిజీ బిజీగా ఉండ‌డంతో.. సురేంద‌ర్ రెడ్డికి అనుకోని విరామం తీసుకోవాల్సివ‌చ్చింది. కొంత‌మంది కోసం క‌థ‌లు సిద్ధం...

సచివాలయం గాయబ్..!

దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం పదకొండు భవనాలను నామరూపాల్లేకుండా తొలగించేశారు. శరవేగంగా ఇరవై ఐదు...

HOT NEWS

[X] Close
[X] Close