రానా నుంచి మ‌రో షో

బుల్లి తెర‌పై కాస్త యాక్టీవ్ గానే ఉంటాడు రానా. ఓ టీవీ ఛాన‌ల్ కోసం ఓఫ‌న్ షోని రూపొందించాడ‌ట‌. `వై ఆర్ యూ` అనే పేరుతో సాగే ఈ ఫ‌న్ షోని త్వ‌ర‌లోనే ఓటీటీ ఛాన‌ల్‌లో స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని రానా స్వ‌యంగా ధృవీక‌రించాడు. లాక్ డౌన్ వ‌ల్ల రానా ఇంటికే ప‌రిమిత‌మైపోయాడు. నెట్‌ఫ్లిక్స్‌, అమేజాన్‌లో ఉన్న సినిమాల‌న్నీ చూసేశాడ‌ట‌. పుస్త‌కాలూ చ‌దివేశాట‌. ఈ ఖాళీ స‌మయాన్ని ఫ‌న్ షోతో భ‌ర్తీ చేసేశాడు. దాంతో పాటు వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇటీవ‌లే రానా నిశ్చితార్థ‌మైంది. ఈ డిసెంబ‌రులోనే రానా పెళ్లి కూడా జ‌ర‌గ‌బోతోంది. మిహిక గురించి రానా మాట్లాడుతూ “మ‌న‌ల్ని మ‌నం సంపూర్ణంగా అర్థం చేసుకున్న‌ప్పుడే మ‌న‌కు ఏం కావాలో తెలుస్తుంది. మిహిక‌తో నాకు చాలాకాలం నుంచి ప‌రిచ‌యం ఉన్నా.. ఓ సంద‌ర్భంలో త‌నే నాకు స‌రైన జోడీ అనిపించింది. చాలా త‌క్కువ స‌మ‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసేసుకున్నా. ఈ విష‌యం చెప్పిన‌ప్పుడు ఇంట్లోవాళ్లు కూడా షాక్ కి గుర‌య్యారు..` అని చెప్పుకొచ్చాడు రానా. త‌ను క‌థానాయ‌కుడిగా న‌టించిన `అర‌ణ్య‌` ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close