ఎమ్మెల్సీగా కవిత ఎన్నికవడం మరింత లేటు..!

మాజీ ఎంపీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఎమ్మెల్సీగా తెలంగాణ శాసనమండలిలో అడుగుపెట్టడానికి మరికొంత సమయం పట్టనుంది. కరోనా కారణంగా ఇప్పటికే ఓ సారి వాయిదా పడిన ఎన్నికను.. మరోసారి వాయిదా వేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికను 45 రోజులు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ మొదటివారంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కొన్ని రోజుల పాటు..నిజామాబాద్‌లో రాజకీయం స్తబ్దుగా ఉంది. అయితే.. గత వారం రోజుల నుంచి మళ్లీ పుంజుకుంది. ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధుల్ని .. టీఆర్ఎస్ ఆకర్షిస్తోంది. నిజామాబాద్‌లో కార్పొరేటర్లను కూడా చేర్చుకుంటోంది.

దీంతో.. కాంగ్రెస్ నేతలు.. ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని..కూతురు గెలుపు కోసం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా.. కవిత గెలుపు పక్కా అనేది రాజకీయవర్గాల మాట. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోయిన కవితకు.. ఏ పదవి లేకపోవడంతో.. క్రియాశీలకంగా లేకుండా పోయారు. దీంతో ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హతా వేటు వేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది.

కవిత ఓడిపోయినప్పటి నుంచి తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ తరపున ఆమె పేరే ముందు ప్రచారంలోకి వస్తోంది. హుజూర్ నగర్ ఉపఎన్నిక..రాజ్యసభ సీట్లు.. ఇలా అన్నింటిలోనూ కవిత పేరే వస్తోంది. అయితే.. అనూహ్యంగా కేసీఆర్ ఎమ్మెల్సీ సీటును ఖరారు చేశారు. కానీ ఎన్నిక మాత్రం వాయిదా పడుతూ వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close