బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన… మోదీని కాకుండా బీజేపీ పాలనను టార్గెట్ చేసుకున్నారు. మోదీపై సుతిమెత్తగానే విమర్శలు చేశారు. రుమాలు తలకు కట్టుకుని ఎర్రకోటపై గాలి ప్రసంగం చేశారని అన్నారు. తెలంగాణకు మోదీ శత్రువయ్యాడని అన్నారు. అయితే బీజేపీనే ఎక్కువ టార్గెట్ చేశారు.

“మోసపోతే.. గోస పడుతం.. మాయమాటలు నమ్మితే దోపిడీకి గురవుతం వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కు తినకుండా చూడాలె ” అని సీఎం కేసీఆర్ వికారాబాద్‌లో ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆగం కాకుండా బుద్ధి జీవులు కాపాడుకోవాలన్నారు. బీజేపీ ఎనిమిదేళ్లలో ఒక్క మంచిపని అయినా చేసిందా? అని ప్రశ్నించారు. మనకు ఉచిత కరెంటు ఉండాల్నా.. వద్దా? మీరే చెప్పండని కేసీఆర్ ప్రశ్నించారు. ఇవాళ పెట్రోల్ ధర ఎంత, గ్యాస్ సిలిండర్ ధర ఎంత? అని ప్రజలు ఆలోచించేలా మాట్లాడారు.

బీజేపీ వాళ్లు ఎక్కడా చేయని సంక్షేమం ఇస్తున్నామన్నారు. 57 ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాం. 10 లక్షల పెన్షన్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీంలతో ఆదుకుంటున్నాం. ఆస్పత్రులలో ఎలా ప్రసవాలు జరుగుతున్నాయో, వారికి కేసీఆర్ కిట్‌లు ఎలా అందిస్తున్నామో అందరికీ తెలుసు. ఇవి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేవని గుర్తు చేశారు. కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలిపేయండి లేదా తెలంగాణలోని పథకాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి అడుగుతున్నారన్నారు. ఎకరానికి రూ.10 వేల రూపాయల పంట పెట్టుబడి తీసుకుంటున్న ఒకే ఒక రైతు ఇండియాలో తెలంగాణ రైతు. రైతులకు ఉచిత కరెంటే కాదు, ప్రాజెక్టులు ఉన్న చోట ఉచితంగా నీరు అందిస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు.

బీజేపీని ఎదుర్కోవడానికి కేసీఆర్ ఇలా .. బీజేపీ పాలనలోని మైనస్‌లు.. తన పాలనలోని ప్లస్‌లపైనే ఆధారపడతారాలేకపోతే ముందు ముందు గతంలోలా మోదీని మళ్లీ టార్గెట్ చే్స్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. అయితే మోదీ విషయంలో.. కేసీఆర్ మాటల్లో మాత్రం స్పష్టమైన మార్పు కనిపించిందని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

5 నెలల్లో రూ. 40వేల కోట్లు గల్లంతయ్యాయట !

ఏపీ బడ్జెట్ నిర్వహణ గురించి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఈ ఐదు నెలల్లో రూ. నలభైవేల కోట్లకుపైగా లెక్కలు తెలియడం లేదని గగ్గోలు...

‘గాడ్ ఫాద‌ర్‌’ హిట్‌… నాగ్ హ్యాపీ!

ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు....

వైసీపీ సర్పంచ్‌ల బాధ జగన్‌కూ పట్టడం లేదు !

వారు వైసీపీ తరపున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీనో.. సొంత పార్టీలో ప్రత్యర్థుల్నో దెబ్బకొట్టడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. గెలిచారు. కానీ ఇప్పుడు వారికి అసలు సినిమా కనిపిస్తోంది. వీధిలైట్...

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు..

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు.. ఇప్పుడు బంతి... వాళ్లిద్ద‌రి చేతికీ చిక్కింది. ఇక ఆడుకోవ‌డ‌మే త‌రువాయి. అవును... అల‌య్ బ‌ల‌య్‌... కార్య‌క్ర‌మంలో చిరంజీవి - గ‌రిక‌పాటి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసింది. చిరుని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close