బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఫామ్‌హౌస్‌లో వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. ఆయన శరీరంలో చక్కెర, సోడియం స్థాయిల్లో తేడాలు కనిపించడంతో వ్యక్తిగత సిబ్బంది వైద్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే కేటీఆర్, హరీష్ రావు కూడా ఫామ్ హౌస్‌కు వెళ్లారు.
కేసీఆర్ ఇటీవలికాలంలో ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు యశోదా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అలాగే ఏఐజీ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకున్నారు. ఇటీవలి కాలంలో తరచూ ఆయనకు అనారోగ్యం చేస్తోంది. గతంలోలా హుషారుగా ఉండలేకపోతున్నారు. నీరసంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలపై ఆలోచనలు చేస్తున్నారు. నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరింతగా నిరసించినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ ఆరోగ్యన్ని మానిటర్ చేసేందుకు ప్రత్యేక వైద్య బృందం ఫామ్ హౌస్ లో ఉంటోంది. యశోదా ఆస్పత్రిలో మరో టీం ఎప్పటికప్పుడు రిపోర్టులను పరిశీలించి వైద్యం సిఫారసు చేస్తూ ఉంటుంది. అయినా కొన్ని ఆరోగ్య సమస్యలు కేసీఆర్‌కు ఎదురవుతూనే ఉన్నాయి.