డ్రగ్స్ కేసుల్లో.. కేసీఆర్ చెప్పినట్లుగా చేస్తే తెలంగాణలో సంచలనాలే..!

తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రగ్స్‌పై అత్యున్నత సమావేశం పెట్టి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు అమలు చేస్తే ఇప్పటి వరకూ కలుగుల్లో ఉన్న ఎంతో మంది వీఐపీలు కటకటాల్లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల టోని అనే స్మగ్లర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు చాలా విషయాలు తెలిశాయని చెబుతున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఖరీదైన హోటళ్లకు, రేవ్పార్టీలకు, పబ్‌లకు చేరవేయడంలో ఓ రాజకీయ పార్టీ నేతది కీలకపాత్రగా గుర్తించినట్లుగా తెలుస్తోంది.

గతంలో కర్నాటక పోలీసులు కూడా పలు కేసులు నమోదు చేశారు. అప్పట్లో పలుకుబడితో కర్ణాటక పోలీసులు తెలంగాణ వైపు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు వదిలి పెట్టేలా లేరు. ఇటీవల హైదరాబాద్ కమిషనర్ డ్రగ్స్‌ వాడుతున్నారంటూ అరెస్ట్ చేసిన వారంతా బడా పారిశ్రామికవేత్తలే. వీరిలో ఇద్దరు ప్రభుత్వ కాంట్రాక్టులు వందల కోట్లలో చేస్తున్నారు. వీరిద్దరూ ఓ మంత్రికి అత్యంత సన్నిహితులు. ఇంకా గుట్టుగా చాలా విషయాలు ఉన్నాయి.. కానీ అవి పోలీసులు.. రాజకీయవర్గాలలో బహిరంగ రహస్యం.

సమీక్షలో సీఎం కేసీఆర్ ” ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలి. ఎవర్నీ వదిలి పెట్టొద్దు అని అని పోలీసులకు సూచించారు. కేసీఆర‌్ ఆదేశాలను పోలీసుల సీరియస్‌గా తీసుకుంటే చాలా మంది జైలుకు వెళ్లడం ఖాయం. ఎక్కువగా అధికార పార్టీ నేతలే ఉంటారు. కానీ గతంలో డ్రగ్స్ కేసులు ఏ తీరానికి చేరాయో చూసిన వారు.. అది జరిగేది కాదని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close