లాక్‌డౌన్ కొనసాగించాలి : కేసీఆర్

తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతుందని.. ఫద్నాలుగో తేదీతో ముగుస్తుందనే ఆశలు పెట్టుకోవద్దని.. సీఎం కేసీఆర్ సంకేతాలు పంపారు. ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తే ససమస్యలు వస్తాయని.. కొనసాగిచాలని ప్రధానమమంత్రి నరేంద్రమోడీకి కూడా సూచించానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్.. లాక్‌డౌన్‌ పొడిగిపుంపై ప్రజల్ని మానసికంగా సిద్ధం చేశారు. ప్రజలు తమకే వచ్చిన ఇబ్బందిగా భావించవద్దని ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ఉందన్న విషయం గుర్తు చేశారు. ఇరవై రెండు దేశాలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అయ్యాయని..మిగతా దేశాలు పాక్షిక లాక్ డౌన్ అయ్యాయన్నారు. కరోనా ప్రపంచానికి పట్టిన చీడగా అభివర్ణించారు.

అమెరికాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. మృతదేహాలను ట్రక్కుల్లో వేసుకెళ్తున్నారని.. అలాంటి పరిస్థితి భారత్‌లో వస్తే తట్టుకోలేమని.. కేసీఆర్ పేర్కొన్నారు. భారత్ లాంటి దేశాల్లో.. జూన్ వరకూ.. లాక్ డౌన్ అమలు చేయాల్సి ఉందని.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక ఇచ్చిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ వల్ల.. దేశం ఆర్థికంగా దెబ్బతింటోందని.. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తీవ్రమైన నష్టం వస్తోందన్నారు. అయినా.. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడానికి లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని గుర్తు చేసారు. తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి నిజాముద్దీన్ ప్రార్థనలే కారణమన్నారు. తెలంగాణకు కూడా నిజాముద్దీన్ పీడ తగిలిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 308 మంది కరోనా పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నామని.. మరో వందకుపైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ముఖ్యమంత్రి ఇన్సెంటివ్ ప్రకటించారు. వైద్యులు, వైద్య సిబ్బందికి జీతంలో పది శాతం సీఎం గిఫ్ట్ కింద ఇస్తామని తెలిపారు. మున్సిపాల్టీలు, పంచాయతీలు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి కూడా ప్రొత్సాహకాలు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో మనో ధైర్యం పెంచాల్సి ఉందని.. కవులు, గాయకులు, బుద్ది జీవులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. జాతి సమైక్యత కోసం..మోడీ పిలుపునిస్తున్న కార్యక్రమాలను విమర్శిస్తున్న వారు.. సమాజానికి అవసరం లేదని మండిపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు రోజుల్లోనే “కుట్ర కోణం” కనిపెట్టిన డీజీపీ..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆలయాలపై జరుగుతున్న దాడుల దర్యాప్తు విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న...

ఎవరూ తగ్గరు.. మరి చర్చలెందుకు..!?

కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలు చర్చల పేరుతో దాగుడు మూతలాడుతున్నాయి. ప్రజలకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడానికా అన్నట్లుగా... వారానికో సారి భేటీ అవుతున్నారు. మూడు నాలుగు గంటల పాటు సమావేశం...

సంక్రాంతి షో అంతా మెగా ఫ్యామిలీదే..!

సంక్రాంతి సంబరాలు సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి సామాన్య జనానికి ఉంటుంది. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు తాము ఎలా జరుపుకుంటామో బయటకు తెలియనివ్వరు. మెగా ఫ్యామిలీ ఈ ఏడాది మాత్రం.. తమ...

క్రాక్ .. పరిశ్రమకి ధైర్యం ఇచ్చింది: గోపీచంద్ మలినేనితో ఇంటర్వ్యూ

రవితేజ, గోపీచంద్ మలినేని కలసి హ్యాట్రిక్ కొట్టేశారు. సంక్రాంతి విజేతగా నిలిచింది క్రాక్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులకు హైవోల్టేజ్ వినోదం ఇచ్చింది. బాక్సాఫీసు వద్ద హంగామా చేస్తుంది. కరోనా...

HOT NEWS

[X] Close
[X] Close