హారిక‌తో చేతులు క‌లిపిన సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌

మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ తెలుగులో రాబోతోంది. హీరోలెవ‌ర‌న్న‌ది ఇంకా ఫిక్స్ కాలేదు గానీ ఈ సినిమాని హారిక హాసిని సంస్థ రూపొందించ‌నుంది. ఓ క‌థానాయ‌కుడిగా రానా ఫిక్స‌యిపోయాడు. రానా ఎప్పుడైతే ఈ క‌థ‌లోకి ఎంట్రీ ఇచ్చాడో, అప్పుడే ఈ సినిమాలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ కూడా వాటా తీసుకుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఆధ్వ‌ర్యంలోనే అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్‌ని తెలుగీక‌రించ‌బోతున్నార‌ని టాక్‌. ఈ రీమేక్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే బాల‌య్య ఎంట్రీపై అటు సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్ గానీ, ఇటు హారిక హాసిని గానీ స్పందించ‌డం లేదు. బాల‌య్య‌కు ఈ క‌థ సూట‌వుతుందా, లేదా? అనే విష‌యంపై ఇప్పుడు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయి. స్క్రిప్టు తొలి వెర్ష‌న్ పూర్త‌య్యాకే.. ఈ విష‌యంపై ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంది. అయితే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది కూడా ఇంకా ఖాయం కాలేదు. ఈ క‌థ‌ని బాగా డీల్ చేయ‌గ‌లిగే ద‌ర్శ‌కుడి కోసం అటు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఇటు హారిక హాసిని అన్వేషిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close