త్రివిక్ర‌మ్ ట‌చ్‌లోకి వెళ్లిన మ‌హేష్‌

మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్‌ల‌ది అదిరిపోయే కాంబినేష‌న్‌. `అత‌డు` డీవీడీలు అరిగిపోయే వ‌ర‌కూ చూశారు. `ఖ‌లేజా` థియేట‌ర్ల‌లో కంటే… హోం థియేట‌ర్ల‌లో ఇర‌గాడేసింది. `అస‌లు అది ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా కాదు` అనేది మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ అభిమానుల మాట‌. వీరిద్ద‌రి నుంచి మ‌రో సినిమా రావాల‌ని ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తున్నారు. దానికి ఇప్పుడు రూట్ క్లియ‌ర్ అవుతున్న‌ట్టు టాక్. మ‌హేష్ త‌దుప‌రి సినిమా ప‌రశురామ్ తో ఫిక్స‌యిపోయింది. కాక‌పోతే.. లేటెస్టుగా అందిన న్యూస్ ఏమిటంటే.. ఈమ‌ధ్య మ‌హేష్ త్రివిక్ర‌మ్ ట‌చ్‌లోకి వెళ్లాడ‌ట‌. `మీకు వీలైతే చెప్పండి.. సినిమా చేసేద్దాం` అని మ‌హేష్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా సైతం ఫిక్స‌యిపోయింది. కానీ ఎన్టీఆర్ కాల్షీట్లు ఎప్ప‌టి నుంచి అందుబాటులో ఉంటాయ‌న్న‌ది స్ప‌ష్టం కాలేదు. ఒక‌వేళ ఎన్టీఆర్ సినిమా ఆల‌స్య‌మై, ఈమ‌ధ్య‌లో మ‌రో సినిమా చేసేంత స‌మ‌యం ద‌క్కితే… ఈ కాంబో మొద‌ల‌య్యే ఛాన్సులు కొట్టిపారేయ‌లేం. మ‌రి ప‌ర‌శురామ్ ఏం చేస్తాడు? అనేదే పెద్ద డౌటు. ప‌ర‌శురామ్ ని మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ ఆప్ష‌న్‌గానే భావిస్తూ వ‌స్తున్నాడు. `ఏదీ కుద‌ర‌క‌పోతే… ప‌ర‌శురామ్ ఉన్నాడులే` అనేది మ‌హేష్ ధీమా. చేతిలో ప‌ర‌శురామ్ ని ఉంచుకుని, మిగిలిన రూట్ల‌న్నీ గాలించాల‌న్న‌ది మ‌హేష్ ఆలోచ‌న‌. అందుకే త్రివిక్ర‌మ్ ట‌చ్‌లోకి వెళ్లాడ‌ట‌. ప‌ర‌శురామ్ సినిమా మొద‌ల‌వ్వ‌డానికి ఇంకా మూడు నెల‌ల స‌మ‌యం ఉంది. ఈలోగా ఏదైనా జ‌ర‌గొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దుబ్బాకలో హరీష్‌ కంగారుకు కారణం ఏమిటి..?

దుబ్బాక ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ మూడో తేదీన పోలింగ్ జరగనుంది. రాజకీయ పార్టీలన్నీ హడావుడి పడుతున్నాయి. అయితే.. అధికార టీఆర్ఎస్ మాత్రం మరీ కాస్త ఎక్కువగా హడావుడి పడుతోంది. ఆ ఉపఎన్నికల...

వైసీపీ బీసీ నేతలకు పదవుల పండగ..!

ఆంధ్రప్రదేశ్‌లో పదవులన్నీ ఒకే కులానికి కట్ట బెడుతున్నారని వస్తున్న విమర్శల నేపధ్యంలో వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భారీ ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ కులానికి ఓ కార్పొరేషన్‌ను...

గ్రేటర్‌లో ఎవరు పుంజుకుంటే వారే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం..!

హైదరాబాద్‌లో ఎన్నికల వాతావరణం ప్రారంభమయింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణ ప్రారంభించడంతో.. తెలంగాణ ఎస్‌ఈసీ కూడా జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు సిద్ధం...

బీజేపీ సూపర్ సీనియర్లకు నిద్ర లేకుండా చేస్తున్న బాబ్రీ తీర్పు

1992 డిసెంబర్‌ 6న ఆయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై లఖ్‌నవ్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ...తీర్పు వెల్లడించనుంది. లిబర్హాన్‌ కమిషన్‌ 17 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2009లో...

HOT NEWS

[X] Close
[X] Close