ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై ఎంత హడావుడి చేస్తే బీఆర్ఎస్‌కు అంత మైనస్ !

పార్టీ మారుతున్న నేతలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నెత్తిన పెట్టుకుంటే తన్నేసి పోతున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పిటిషన్లు వేస్తున్నారు. అక్కడ్నుంచి నిర్ణయం రాక ముందే కోర్టుకు వెళ్తామని హడావుడి చేస్తున్నారు. నిజానికి గత చరిత్ర ఎంతో ఘనంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు.. వీలైనంత వరకూ మౌనం పాటిస్తే.. తమ పాత ఘనకార్యాలు చర్చల్లోకి రాకుండా ఉంటాయి. కుదిరితే.. ఎమ్మెల్యేలకు భరోసా కల్పించి పార్టీ మారకుండా చూసుకోవాలి. అంతే కాదు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏదో చేస్తామని ఆవేశపడితే .. పాత లెక్కలన్నీ బయటకు వస్తాయి.

పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ దేశంలోనే ఓ కొత్త మోడల్ సృష్టించారు. అదేమిటంటే. ఎల్పీల విలీనం. అసలు ఎల్పీల విలీనం అనే అంశం ఎక్కడా లేదు. కేసీఆరే సృష్టించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఓ పార్టీ కి చెందిన మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకుంటే..అనర్హతా వేటు వర్తించదు. వారిని స్పీకర్ ప్రత్యేకంగా గుర్తించవచ్చు. కానీ ఈ నిబంధనను విలీనంగా వాడేసుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ , టీడీపీ ఇలా ఏ పార్టీని వదిలి పెట్టలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి బీఆర్ఎస్‌కు వచ్చింది.

ఇప్పుడు తాము ఎమ్మెల్యేలపై అనర్హతా వేటుకు ప్రయత్నిస్తామని వారు రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆగడం లేదు. గతంలో ఏం చేశారనే ప్రశ్న వస్తుందని తెలిసినా తగ్గడం లేదు. నిజానికి కేసీఆర్ అయినా.. కేటీఆర్ అయినా ఇప్పుడు చేయాల్సింది.. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ..భవిష్యత్ ఉంటుందని వారికి భరోసా కల్పించడం. ఆ పని మానేసి.. బెదిరించి పార్టీలో ఉంచుకుంటామన్నట్లుగా తీరు ఉంది. ఏదైనా అంతిమంగా స్పీకర్ నిర్ణయమే. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు కూడా కాదనలేవు. ఈ విషయం బీఆర్ఎస్ పెద్దలకు తెలియకుండానే రాజకీయం చేస్తున్నారా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close