సింగరేణి ప్రచారంలో సిఎం

సింగరేణి గని కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల పోరాటం ఒక నియోజకవర్గ ఎన్నికల రాజకీయాన్ని మించి పోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఎఅరుటియుసి అరుఎన్‌టియు సిటిఎన్‌టియుసి అంటే వాస్తవంలో సిపిఅరు కాంగ్రెస్‌ తెలుగుదేశం కలసి పోటీ చేస్త్తున్నాయి. సిఅరుటియు విడిగా రంగంలో వుంది. టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2012లో గుర్తింపు పొందగలిగింది.అంతకు ముందు ఎక్కువ సార్లు ఎఅరుటియుసి యూనియన్‌ వుండింది. వారసత్వ ఉద్యోగాల రద్దుకు ఈ యూనియన్‌ 2002లో సంతకాలు చేసింది.అయితే తీవ్ర నిరసనలు రావడంతో 2016 అక్టోబరులో ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వు లోపభూయిష్టంగా వుండటంతో హైకోర్ట్ కొట్టివేసింది. ఇంత కష్టమైన గనులలో దిగి పనిచేసే తమ సంతానానికి వారసత్వ ఉద్యోగాలు నిరాకరించడం కార్మికులలో తీవ్ర ఆగ్రహానికి కారణమయింది. ఈ ఎన్నికలలో అదే ప్రధాన సమస్యగా వుండగా ఈ రెండు యూనియన్లు ఆత్మ రక్షణలో పడ్డాయి. ఎంపి కవిత ప్రధాన ప్రచార బాధ్యత తీసుకోవడమే ఇతర యూనియన్లనుంచి ఫిరాయింపుల తరహాలో నాయకుల వలసను ప్రోత్సహించారు. వీరిలో కొందరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయట. రాజకీయాల్లోలాగే సామూహిక ఫిరాయింపుల తతంగం ఈ ఎన్నికల ప్రాధాన్యతను చెబుతుంది. సింగరేణి మేనేజిమెంటు కూడా ఎన్నికల ముంగిట్లో కొన్ని వరాలు ప్రకటించింది. చివరకు శుక్రవారం నాడు ఏకంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రగతిభవన్‌లో మీడియా గోష్టి పెట్టిమరీ టిజికెఎస్‌ విజయం కోసం ప్రచారం చేశారు. తాము తీసుకున్న చర్యలను ఏకరువు పెడుతూ భవిష్యత్తులోనూ మరిన్నిచర్యలు తీసుకుంటామని వారసత్వం పేరిట ఉద్యోగాలు ఇవ్వడంలో చిక్కులున్నందున కారుణ్య నియామకాల పేరిట ఇస్తామని ప్రకటించారు. ఏది ఏమనా ఇలా ఒక యూనియన్‌ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అధికార నివాసంలో ప్రచారం చేయడం, పోలింగుకు ముందు ప్రభుత్వం తరపున వాగ్దానాలు చేయడం వివాదాస్పదమే. ఎందుకంటే తమ సంఘం గెలుపుకోసం అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాధికరాన్ని వినియోగించే హక్కు వుండదు.వుండకూడదు కూడా. బహుశా గతంలో ఎప్పుడూ ఒక యూనియన్‌ ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి అధికార నివాసం ఉపయోగించడం గతంలో జరిగివుండదేమో.. పోటీ చేశాము గనక గెలుపుకోసం తప్పక కృషి చేస్తాం, వచ్చేవారిని చేర్చుకుంటాం అని కెసిఆర్‌ బల్లగుద్ది చెప్పడం మరింత విపరీతం. అనేక నియోజకవర్గాలు జిల్లాలకు విస్తరించిన సింగరేణి ఎన్నికల పలితంప ముఖ్యమంత్రి ఎంత కేంద్రీకరిస్తున్నారో దీన్నిబట్టే తెలుస్తుంది. దీనంతటిని బట్టి చూస్తే టిజెకెఎస్‌ అధికార సంస్థగా భావించవలసి వుంటుందన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com