రైతు అజెండాగా కేంద్రంపై కేసీఆర్ సమరభేరీ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కేంద్రంగా కేంద్రప్రభుత్వంపై సమరభేరీ మోగించారు. జనగామ జిల్లాలో రైతు వేదికను ప్రారంభించిన కేసీఆర్… కేంద్రం రైతుల్ని దగా చేస్తుందని చెప్పడానికి తనదైన లాంగ్వేజ్ ఎంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా అయితే సవాళ్లతో.. లాజిక్కులతో ప్రసంగాలు చేసేవారో.. అచ్చంగా అలాగే.. రైతు కేంద్రంగా రాజకీయం ప్రారంభించారు. కేంద్రం వ్యవసాయ బిల్లులను అడ్డగోలుగా పాస్ చేసిందని..ఢిల్లీ రైతు తెలంగాణకు వచ్చి అమ్ముకుంటాడా.. అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని .. రావణాసురుడికి బదులు మోదీ బొమ్మలు తగులబెడుతున్నారని వివరించారు. మనం కూడా పిడికిలి బిగించాలని రైతులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు ..కళ్లు తెరిపించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదని …కానీ తెలంగాణ సర్కార్ మాత్రం గ్రామాలకే వచ్చి కొనుగోలు చేస్తోందన్నారు. రైతు వేదిక ఒక ఆటం బాంబ్‌.. అద్భుతమైన శక్తిగా కేసీఆర్‌ అభివర్ణించారు. ఏ పంట వస్తే లాభమో రైతు వేదికలే నిర్ణయించాలన్నారు. 95శాతం రైతు వేదికలు ఇప్పటికే పూర్తయ్యాయని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రైతుల నిరసనలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. అయితే అవి జరుగుతూనే ఉంటాయని చెప్పుకొచ్చారు. అమెరికా, యూరప్‌లో కూడా రైతులు నిరసనలు తెలియజేస్తూనే ఉంటారన్నారు.

దుబ్బాక ఎన్నికలపైనా కేసీఆర్ తన ప్రసంగంలో స్పందించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. బీజేపీ నేతలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 38 లక్షల 64వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తుంటే.. కేంద్రం కేవలం 7 లక్షల మందికి రూ.200 మాత్రమే ఇస్తోందని.. తాను చెప్పేది అబద్దం అయితే తక్షణం రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. రైతు వేదికల కేంద్రంగా కేసీఆర్… కేంద్రంపై దండెత్తినట్లుగానే రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్ వ్యవసాయ సమస్యలనే హైలెట్ చేసుకుంటారని.. వ్యవసాయానికి తాము తెలంగాణ తీసుకున్న చర్యలనే .. హైలెట్ చేస్తారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close