క్లాప్ కొట్ట‌లేదు.. కానీ టీజ‌ర్ వ‌చ్చేస్తోంది

సినిమా కంటే ప్ర‌చారం ముందుగా మొద‌లైపోతున్న రోజులివి.  క్లాప్ కొట్ట‌కముందే, జ‌నాలు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఏదో కొత్తగా ప్ర‌య‌త్నించాల్సిందే. క‌మల్ హాస‌న్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఖైదీ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శక‌త్వంలో క‌మ‌ల్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. దీనికి నిర్మాత క‌మ‌ల్ హాస‌నే. షూటింగ్ ఇంకా మొద‌లు కాలేదు. అయితే.. ఈలోగానే టీజ‌ర్ వచ్చేస్తోంది.

న‌వంబ‌రు 7..క‌మ‌ల్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ వ‌ద‌ల‌బోతున్నారు. సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే టీజ‌ర్ ఎలా అనుకుంటున్నారా?  ఈ సినిమాకి సంబంధించి ఓ ట్రైల్ షూట్ జ‌రిగింది. అందులో టీజ‌ర్‌కి కావ‌ల్సిన షాట్స్ తీసి పెట్టుకున్నాడు ద‌ర్శ‌కుడు. దాన్నే ఇప్పుడు విడుద‌ల చేస్తున్నార‌న్న‌మాట‌. నిజానికి ఈ పుట్టిన‌రోజున క‌మ‌ల్ – భార‌తీయుడు 2 టీజ‌ర్ వ‌స్తుందేమో అనుకున్నారు. ఆ సినిమా కొంత మేర షూటింగ్ జ‌రుపుకుంది. కానీ.. ఇప్పుడు ముందుకా, వెన‌క్కా.. అనే సందేహంలో, సందిగ్థంలో ప‌డింది. ఇలాంటి స‌మ‌యంలో.. టీజ‌ర్ ఎందుకు వ‌దులుతారు?  ఆ స్థానంలోనే..కమ‌ల్ త‌న కొత్త సినిమా టీజ‌ర్‌ని చూపించి, ఫ్యాన్స్ ని ఖుషీ చేయ‌బోతున్నాడంతే. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేశారా?

'ఆచార్య‌' త‌ర‌వాత‌... 'వేదాళం' రీమేక్ మొద‌లెట్ట‌బోతున్నాడు చిరంజీవి. బహుశా.. 2021 మార్చిలో 'వేదాళం' సెట్స్‌పైకి వెళ్లొచ్చు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే `వేదాళం`...

రాత్రికి రాత్రి పంటల బీమా సొమ్ము చెల్లింపు..!

పంటల బీమా విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది. రైతుల తరపున.. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని హడావుడిగా నిన్న...

కర్ణాటకలోనూ పంచాయతీఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత...

HOT NEWS

[X] Close
[X] Close