సంతోషం సగమే పంచిండు…మిగతాది ఎప్పుడు?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఓ రేంజ్‌లో ఆడుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎట్టకేలకు వారికి తీపి కబురు చెప్పి వారి నోటిని తీపి చేశాడు. సమ్మెలో కేసీఆర్‌ డౌన్‌ డౌన్‌ అన్న కార్మికులు తీపి కబురు వినగానే ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ‘సార్‌…చానా మంచోడు’ అంటూ ప్రశంసలు కురిపించారు. ముందు తమ ఉద్యోగాలు నిలబడ్డాయి. అది చాలు కార్మికులకు. ఆగమేఘాల మీద డ్యూటీలకు బయలుదేరారు. సరే….ఇదంతా బాగానే ఉందిగాని, సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు సంతోషాన్ని సగమే పంచాడు. ఇంకా పూర్తిగా పొట్ట నింపలే. ఇంకా పూర్తిగా కడుపులో పెట్టుకోలే. ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను ఉద్యోగాల్లో చేర్చుకున్నాడు కదా. ఇంకేం కావాలి? అని ప్రశ్నించవచ్చు. చేర్చుకున్నాడు నిజమే.

కాని జీతాల మాట ఎత్తలేదు ఎందుకు? వారు మూడు నెలల జీతం వస్తుందని అనుకుంటున్నారు. సెప్టెంబరులో వారు డ్యూటీలోనే ఉన్నారు. ఆ నెల జీతం ఇవ్వలేదు. అక్టోబరు 5 నుంచి సమ్మెలోకి వెళ్లారు. నవంబరు చివరి వారం వరకు సమ్మెలో ఉన్నారు. సమ్మెలో ఉన్న కాలానికి కూడా జీతం ఇవ్వాలనుకుంటే మూడు నెలల జీతం ఇవ్వాలి. సమ్మె కాలానికి జీతం ఇచ్చే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకున్నా సెప్టెంబరు నెల జీతం తక్షణమే ఇచ్చేస్తే వారికి ఉపశమనం కలుగుతుంది కదా. సమ్మె కాలానికి జీతం ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. కార్మికుల సెలవులు గట్రా లెక్కలు కట్టి అడ్జస్టు చేసి జీతాలు ఇచ్చారు.

ఈసారి కూడా అలాగే ఇస్తారని కార్మికులు ఆశ పడుతున్నారు. డ్యూటీల్లో చేరాలని తీపి కబురు వినిపించిన కేసీఆర్‌ జీతాల విషయం ఏమీ చెప్పకుండా చేదును అలాగే ఉంచాడు. ఇన్నాళ్లూ ఉద్యోగాలు ఉంటాయో పోతాయోనని ఆందోళనపడి భయపడిపోయిన కార్మికులు ఇక నుంచి జీతాలు వస్తాయో రావోనని ఆందోళన పడతారు. దాంతో మళ్లీ గుండెపోటు మరణాలు, ఆందోళనతో మతిస్థిమితం తప్పడం మొదలైనవి జరుగుతాయేయో…! కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేంతగా, గుండెపోటుతో చనిపోయేలా ఎడాపెడా ఆడుకున్న ముఖ్యమంత్రి ఇంకా కొంతకాలం ఆడుకోడని గ్యారంటీ ఏమీలేదు. ఒకవేళ జీతాలు ఇవ్వకపోయినా డిమాండ్‌ చేసే దమ్ము, ధైర్యం కార్మికులకు ఉంటాయా? కేసీఆర్‌ వారికి ఆ పరిస్థితి కల్పించాడు.

సీఎం నిన్న చెప్పిన మాటలను పరిశీలిస్తే, ‘నేను తలచుకుంటే మీ ఉద్యోగాలు ఊడుతయ్‌. కాని ఏదో దయ తలచి ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నా. ఇకనైనా బుద్ధిగా ఉంంటూ జాత్త్రగా పనిచేసుకోండి’ ….అనేది సారాంశం. కార్మికులు మళ్లీ యూనియన్ల జోలికిపోతే మటాషే అనే హెచ్చరికలు కూడా సీఎం చేశాడు. హైకోర్టు చెప్పినట్లుగా తాను లేబర్‌ కోర్టుకు రిఫర్‌ చేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని చెప్పాడు. లేబర్‌ కోర్టు తాను చెప్పినట్లు చేస్తుందనే అర్థం కావొచ్చు. ఆర్‌టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని తాము ప్రకటించబోమని హైకోర్టు స్పష్టం చేసినా కేసీఆర్‌ మాత్రం ఇది చట్టవిరుద్ధమేనని తీపి కబురు వినిపిస్తూ కూడా తన స్టాండ్‌ మీదనే ఉన్నాడు. ఆర్‌టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచన తనకు లేదన్నాడు. ‘ఆర్టీసీని పెట్టుబడిదారులకో, షావుకార్లకో ఇవ్వదలచుకోలేదు’ అన్నాడు.

కార్మికులకు బుద్ధి రావాలనే ఉద్దేశంతోనే తాను కావాలనే కఠినంగా వ్యవహరించినట్లు చెప్పాడు. అంటే ఆర్‌టీసీ కార్మికులను భయపెట్టడానికి, వారు తిరిగి జీవితంలో సమ్మె ఊసెత్తకుండా ఉండటానికి కేసీఆర్‌ ఇన్నాళ్లు ‘కార్మికులతో ఆట’ అనే నాటకం ఆడాడు. మీడియాకు రకరకాల లీకులు ఇచ్చి చివరకు ‘ఇదంతా ఉత్తిదే’ అని తేల్చిపారేశాడు. తాను నియంతను, దుర్మార్గుడిని కానని, మంచి మనసున్నవాడినని చెబుతూ శుభం కార్డు వేశాడు.

మంత్రులు చెప్పినందువల్ల తాను కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు సెలవిచ్చాడు. కాని అంత సీనుండదు. కేంద్రానికి భయపడి కేసీఆర్‌ దిగొచ్చాడని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ చెప్పుకున్నాడు. కాని అందులో నిజానిజాలు తెలియవు. తక్షణం కనిపిస్తున్న కారణం మున్సిపల్‌ ఎన్నికలు. అవి త్వరలోనే జరగబోతున్నాయి. తాను మొండిపట్టుదలతో ఉంటే మున్సిపల్‌ ఎన్నికల్లో నష్టం కలుగుతుందని అనుకొని ఉండొచ్చు. టీఆర్‌ఎస్‌ ఓడిపోతే ప్రతిపక్షాలకు, ముఖ్యంగా బీజేపీకి బలం చేకూరతుందని భావించివుండొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close